తెలుగు సినీ రంగంలో మరో విషాదం.. సీనియర్ కమెడియన్ కన్నుమూత!
సినీ రంగంలో ఈ మధ్య వరుసగా విషాదకర ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీకి చెందిన అనేక మంది నటీనటులు, టెక్నీషియన్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఈ మధ్య ప్రాణాలు కోల్పోతూ వస్తున్నారు. ఇటీవలే నటుడు డానియల్ బాలీజీ చనిపోగా.. ఈరోజు ఉదయమే మరో గ్రేట్ రైటర్ కన్నుమూశారు. 74 ఏళ్ల వయసు కల్గిన శ్రీ రామకృష్ణ చనిపోయినట్లు తెలిసిన కొన్ని గంటల్లోనే మరో టాలీవుడ్ టాప్ కమెడియన్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన ఎవరు ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకప్పుడు కమెడియన్ గా అనేక తెలుగు, తమిళ సినిమాల్లో కనిపించిన విశ్వేశ్వర రావు ఈ రోజు ప్రాణాలు విడిచారు. 62 ఏళ్ల వయసు కల్గిన ఈయన అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ.. మంగళ వారం రోజు ఉదయం కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చేకూరాలని, విశ్వేశ్వరరావు ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.

విశ్వేశ్వర రావు స్వస్థలం ఆంధ్ర ప్రదేశ్ లోని కాకినాడ. అయినప్పటికీ ఆయనకు సినిమాలపై ఉన్న ఇష్టంతో చెన్నైలో సెటిల్ అయ్యారు. అక్కడే ఉండి సినిమాలు చేసుకుంటూ కెరియర్ కొనసాగించారు. తెలుగుతో పాటు తమిళంలో కూడా అనేక సినిమాలు, సీరియల్స్ చేసిన ఈయన భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం చెన్నైలోని సిరుశేరిలోని ఆయన నివాసంలో ఉంచారు. అంతేకాకుండా ఈయన అంత్యక్రియలను బుధవారం రోజు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
నటుడిగా, కమెడియన్ గానే కాకుండా విశ్వేశ్వర రావు దర్శకుడిగా, నిర్మాతగా కూడా అనేక సినిమాలు నిర్మించారు. 6 ఏళ్ల వయసు నుంచే నటించడం ప్రారంభించిన ఈయన ఇప్పటి వరకు మొత్తం 350కి పైగా సినిమాల్లో కనిపించారు. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా అనేక సీరియల్స్ లో కూడా నటించారు.


Click it and Unblock the Notifications











