అర్ధరాత్రి 2 గంటల సమయంలో అలాంటి పని .. ఎయిడ్స్ రాకపోయుంటే : అన్నపూర్ణమ్మ సంచలన వ్యాఖ్యలు

తెలుగు చిత్ర సీమలో తల్లి, బామ్మ క్యారెక్టర్లంటే గుర్తొచ్చేవారు కొందరే. కన్నాంబ, హేమలత, నిర్మలమ్మ, అన్నపూర్ణలు ఈ విభాగంలో బ్రాండ్ అంబాసిడర్‌లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిలో అన్నపూర్ణమ్మ ఈ తరానికి కూడా బాగా తెలుసు. అందరికీ అమ్మ అన్నపూర్ణమ్మగా ఆమె నిలిచిపోయారు. దాదాపు 700కు పైగా సినిమాల్లో .. మూడు తరాల హీరోలతో కలిసి నటించిన అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. గ్లామర్ బామ్మ అని కొందరు.. అందాల అమ్మమ్మ అని మరికొందరు అన్నపూర్ణమ్మను పిలుచుకుంటూ ఉంటారు.

దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కించిన స్వర్గం నరకం సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు భార్యగా నటించిన అన్నపూర్త.. తర్వాతి కాలంలో ఆయనకే తల్లిగా ఎన్నో సినిమాల్లో కనిపించారు. ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, సుమన్, రాజేంద్రప్రసాద్ వంటి స్టార్‌లకు అమ్మగా నటించారు. ఆ నెక్ట్స్ జనరేషన్‌కు బామ్మగా వందల చిత్రాల్లో కనిపించారు. 80కు దగ్గరవుతున్నా ఇంకా యాక్టీవ్‌గా ఉంటూ.. బుల్లితెరపై జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలతో నవ్విస్తూ కుర్రాళ్లకు పోటీ ఇస్తున్నారు. సినిమాలు తగ్గించినా బుల్లితెర ద్వారా ఈ వయసులోనూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు అన్నపూర్ణమ్మ.

senior actress Annapoornaamma sensational comments on casting couch in film industry

మెయిన్ స్ట్రీమ్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్లకు ఈ మధ్య ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇస్తున్న అన్నపూర్ణమ్మ తన కెరీర్ వ్యక్తిగత విషయాలు, పరిశ్రమలో ఎదుర్కొన్న కష్టాలు, ఇండస్ట్రీకి సంబంధించిన సంఘటనలను పంచుకుంటున్నారు. ఏ విషయమైనా సరే కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడటం ఆమె స్టైల్. ఆ ఇంటర్వ్యూలు చూస్తే ఏది దాచుకున్నట్లుగా అనిపించదు.. అంత ఓపెన్ మైండెడ్. మొన్నామధ్య పరిశ్రమలోని క్యాస్టింగ్ కౌచ్ గురించి అన్నపూర్ణమ్మ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

తప్పు అనేది ఎప్పుడూ ఒకరి వైపే ఉండదని, ఇద్దరికీ ఇష్టం ఉండాలన్నారు. ప్రతిరంగంలోనూ మహిళలు క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొంటున్నారని.. కానీ కుటుంబం, పరువు, మర్యాదలు అనే వాటిని గుర్తుంచుకుని, అత్యంత అప్రమత్తంగా ఉంటూ ప్రలోభాలకు లొంగకుండా మహిళలు తప్పించుకుంటున్నారని ఆమె చెప్పారు. అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్లకి కష్టాలు తప్పవని.. అన్నింటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడాలని అన్నపూర్ణమ్మ సూచించారు.

తన విషయానికి వస్తే.. అప్పట్లో అవకాశాల కోసం వేధించేవాళ్లని, ఛాన్స్ ఇస్తే మరి మాకేంటి అని అడిగేవారని.. అందుకే 20 ఏళ్లకే పెళ్లి చేసుకుని, 25 ఏళ్లకే అమ్మ క్యారెక్టర్లు చేశానని అన్నపూర్ణమ్మ వెల్లడించారు. తల్లి పాత్రలు వేయడం వల్ల అలాంటి వేధింపులు చాలా వరకు తగ్గాయని ఆమె గుర్తుచేసుకున్నారు. షూటింగ్ కోసం ఎక్కడో తిరిగేవాళ్లమని, ఎక్కడో స్టే చేసేవాళ్లమని.. ఆ సమయంలో అర్ధరాత్రి 2 గంటలకు కూడా కొందరు కక్కుర్తిగాళ్లు మా రూమ్ తలుపులు కొట్టేవాళ్లని అన్నపూర్ణమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.

senior actress Annapoornaamma sensational comments on casting couch in film industry

ఎయిడ్స్ వ్యాధి వచ్చినప్పుడు ఇండస్ట్రీలో ఇలాంటి ఘటనలు తగ్గాయని.. ఎవరికి ఏ అనారోగ్యం ఉందోనని దగ్గరికి కూడా వచ్చేవాళ్లు కాదని వెల్లడించారు. కొన్ని ఎందుకు జరుగుతాయో కారణాలు తెలియదు కానీ.. వాటి వల్ల మంచి చెడు రెండూ ఉంటాయని అన్నపూర్ణమ్మ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X