8 గంటలు అదే పని .. అంతా పీల్చేస్తారు , సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్
ఇప్పుడుంటే తల్లి, బామ్మ క్యారెక్టర్లు మోడ్రన్‌గా మారిపోయాయి గానీ.. తెలుగు చిత్ర సీమలో ఒకప్పుడు తల్లి, బామ్మ క్యారెక్టర్లకు సెపరేట్ బ్యాచ్ ఉండేది. కన్నాంబ, హేమలత, నిర్మలమ్మ, అన్నపూర్ణలు ఈ విభాగంలో బ్రాండ్ అంబాసిడర్‌లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిలో అన్నపూర్ణమ్మ నేటి తరానికి కూడా బాగా తెలుసు. అందరికీ అమ్మ.. అన్నపూర్ణమ్మగా స్టార్ హీరోల చేత నీరాజనాలు అందుకున్నారు. దాదాపు 50 ఏళ్లకు పైగా కెరీర్‌లో 900కు పైగా సినిమాల్లో .. మూడు తరాల హీరోలతో కలిసి నటించిన అరుదైన ఘనత అన్నపూర్ణమ్మ సొంతం. గ్లామర్ బామ్మ అని కొందరు.. అందాల అమ్మమ్మ అని మరికొందరు అన్నపూర్ణమ్మను పిలుచుకుంటూ ఉంటారు.
దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కించిన స్వర్గం నరకం సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు భార్యగా నటించిన అన్నపూర్ణ .. తర్వాతి కాలంలో ఆయనకే తల్లిగా ఎన్నో సినిమాల్లో కనిపించారు. ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, సుమన్, రాజేంద్రప్రసాద్ వంటి స్టార్‌లకు అమ్మగా నటించారు. ఆ నెక్ట్స్ జనరేషన్‌కు బామ్మగా వందల చిత్రాల్లో కనిపించారు.

80కు దగ్గరవుతున్నా ఇంకా యాక్టీవ్‌గా ఉంటూ .. బుల్లితెరపై జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలతో యంగ్ జనరేషన్‌కు పోటీ ఇస్తున్నారు అన్నపూర్ణమ్మ. సినిమాలు తగ్గించినా బుల్లితెర ద్వారా ఈ వయసులోనూ ఇంకా తెలుగువారిని అలరిస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్లకు ఈ మధ్య ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇస్తున్న అన్నపూర్ణమ్మ తన కెరీర్ వ్యక్తిగత విషయాలు, పరిశ్రమలో ఎదుర్కొన్న కష్టాలు, ఇండస్ట్రీకి సంబంధించిన సంఘటనలను పంచుకుంటున్నారు.
ఏ విషయంపై అయినా సరే కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడటం ఆమె స్టైల్. మొన్నామధ్య పరిశ్రమలోని క్యాస్టింగ్ కౌచ్ గురించి అన్నపూర్ణమ్మ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో వర్క్ కల్చర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మద్రాస్‌లో ఉన్నన్ని రోజులు 8 గంటలు నుంచి 9 గంటల పాటు చెమటలు కారుతున్నా వర్క్ చేసేవాళ్లమని అన్నపూర్ణమ్మ తెలిపారు.
తెల్లవారుజామున 4 గంటలకి లేచి వాహిని స్టూడియోకి వెళ్లే వాళ్లమని, అక్కడి పెద్దవాళ్లంతా తన వంక కోపంగా చూసేవారని అలా పనిచేసేసరికి ఓపిక అయిపోతుందని, ఇక సాయంత్రం శృంగారం గురించి ఏం ఆలోచిస్తామని గుర్రుపెట్టి నిద్రపోతామని అన్నపూర్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాకు ఒప్పందం చేసుకున్న మొత్తం ఇవ్వకుంటే తాను పోట్లాడేదాన్నని తెలిపారు. నా తల్లి, భర్త తనను వెనకుండి నడిపించారని అన్నపూర్ణమ్మ పేర్కొన్నారు. వయసుకు తగ్గట్లుగా మనల్ని ప్రేమించేవాడు ఉంటాడని ఆమె అన్నారు. ప్రస్తుతం అన్నపూర్ణమ్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











