ఎన్టీఆర్ అభిమానులకు మద్దతు ఇచ్చిన సీనియర్ హీరోయిన్.. మీరా చోప్రాకు అదిరిపోయే కౌంటర్?

ఇంటర్నెట్ లో ప్రస్తుతం మీరా చోప్రా వర్సెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వార్ ఏ రేంజ్ లో నడుస్తుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ అంటే ఎవరో తెలియదన్న ఒకే ఒక్క మాట నుంచి వ్యవహారం సైబర్ క్రైమ్ వరకు వెళ్లింది. అసలు ఈ రేంజ్ లో వివాధాలు ఉంటాయని ఎవరు ఊహించలేదు. ఇకపోతే మీరా చోప్రా గ్యాప్ లేకుండా ఎన్టీఆర్ అభిమాబులపై మండిపడుతుండడంతో ఆమెకు కౌంటర్ గా సీనియర్ హీరోయిన్ కుష్బూ సుందర్ స్పందించడం హాట్ టాపిక్ గా మారింది.

 ఒక్క మాటతో..

ఒక్క మాటతో..

ఇటీవల హాట్ హీరోయిన్ మీరా చోప్రా అభిమానులతో సోషల్ మీడియాలో మాట్లాడిన విషయం తెలిసిందే. సాధారణంగా లైవ్ లో చిట్ చాట్ చేస్తున్నప్పుడు సినీ తారలు ప్రతి ఒక్క విషయంపై స్పందిస్తారన్న గ్యారెంటీ లేదు. కేవలం వారికి నచ్చిన విషయాల గురించి స్పందిస్తారు. అయితే ఒక అభిమాని ఎన్టీఆర్ గురించి ఒక చిన్న మాట చెప్పమని అంటే మీరా చోప్రా అతను ఎవరో నాకు తెలియదు అని కామెంట్ చేసింది.

ట్రోలింగ్.

ట్రోలింగ్.

ఆ ఒక్క మాటకు టాలీవుడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా వరకు ఆమెను ట్రోల్ చేశారు. కొందరైతే పచ్చి బూతులు తిడుతున్నారు అని మీరా చోప్రా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫైనల్ గా ఆమె FIR కూడా నమోదు చేసేవరకు వెళ్ళింది. సైబర్ క్రైమ్ కి మొదటిరోజే ఈ వివాదం గురించి చెప్పిన మీరా చోప్రా ఇంకా అదే విషయం గురించి రోజు ఎదో ఒక ట్వీట్ చేస్తూనే ఉంది.

 కుష్బూ రివర్స్ కౌంటర్..

కుష్బూ రివర్స్ కౌంటర్..

ఈ వివాదంలోకి అనుకోకుండా కుష్బూ ఎంట్రీ ఇచ్చింది. కొందరు మహిళలు ఎప్పటికి మారరు. నేర్చుకోరు కూడా.. ఆ విషయంలో వాళ్ళు పేద వాళ్ళు.. అంటూ ఆమె ఊహించని కౌంటర్ ఇచ్చారు. పేరు ప్రస్తావించకుండానే కుష్బూ సైలెంట్ కౌంటర్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ విధంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఆమె సపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Recommended Video

Raashi Khanna Speech At Worlds Famous Lover Event
మీరా చోప్రా ఏమంటుందో?

మీరా చోప్రా ఏమంటుందో?

కుష్బూ పరోక్షంగా కౌంటర్ ఇవ్వడంతో ఎన్టీఆర్ అభిమానుకు ఆమెకు డైరెక్ట్ గా ధన్యవాదాలు చెబుతున్నారు. నీకె కౌంటర్ అంటూ కుష్బూ సుందర్ ట్వీట్ వద్ద మీరా చోప్రాను ట్యాగ్ చేస్తున్నారు. ఇక మీరా చోప్రా కూడా సోషల్ మీడియాలో బిజిగానే ఉంది కాబట్టి కుష్బూ ట్వీట్ పై ఎలాంటి రిప్లై ఇస్తుందో అని ఓ వర్గం వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X