twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శవాల గుట్టలు.. ఆయనను చూడటానికి కూడా కుదరలేదు: యూఎస్ లో దీన స్థితిపై మాజీ హీరోయిన్

    |

    అగ్రరాజ్యం అమెరికా ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనగలిగే శక్తి ఉన్నా దేశమని ప్రపంచానికి తెలుసు. కానీ అది మొన్నటి వరకు. ఇప్పుడు కనిపించని శత్రువుతో అగ్రరాజ్యం విలవిలలాడుతోంది. కరోనా దెబ్బకి పరిస్థితులు ఎంతటి దారుణంగా మారాయి అంటే.. శవాల గుట్టలు పెరుకుపోవడంతో వాటిని క్రేన్లతో ఒకేసారి సమాధి చేస్తున్నారు. కనీసం బంధువులను కడసారి కూడా చూసుకోలేని పరిస్థితుల్లో అక్కడి వారు ఎంతో మనోవేదనకు లోనవుతున్నారు.

    న్యూయార్క్‌లో దీన పరిస్థితుల్లో..

    న్యూయార్క్‌లో దీన పరిస్థితుల్లో..

    న్యూయార్క్ లో ఉన్న మాజీ హీరోయిన్ అక్కడి వారి దీన పరిస్థితి గురించి తనదైన శైలిలో వివరణ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు. సీతారామరాజు సినిమాలో నాగార్జున సోదరిగా నటించి అప్పట్లో సిస్టర్స్ క్యారెక్టర్స్ కి స్పెషల్ ఆర్టిస్ట్ గా నిలిచిన మాన్య. అలాగే తమిళ్ మలయాళం భాషల్లో హీరోయిన్ గా కూడా కొన్నాళ్లపాటు కొనసాగింది. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఫైనాన్స్ ప్రొఫెషినల్ గా పనిచేస్తోంది. న్యూ యార్క్ లో ఫ్యామిలితో ఉంటున్న మాన్య అక్కడ కరోనా వైరస్ కారణంగా పడుతున్న ఇబ్బందులను గురించి వివరణ ఇచ్చింది.

     న్యూజెర్సీలో కోవిడ్ 19 విజృంభణ

    న్యూజెర్సీలో కోవిడ్ 19 విజృంభణ

    మాన్య మాట్లాడుతూ.. ఎక్కడ చూసినా విషమ పరిస్థితులు కనిపిస్తున్నాయి. న్యూ యార్క్, న్యూజెర్సీ వంటి ప్రాంతాల్లో వేల మందికి కోవిడ్ 19 పాజిటివ్ వచ్చింది. రోజురోజుకి కరోనా పాజిటివ్ భారిన పడుతున్న వారి సంఖ్య లక్షలకు పెరుగుతోంది. ఊహించని విధంగా. పెద్దా చిన్నా తేడా లేకండా ఆరోగ్యంగా ఉన్నవారిని కూడా ఈ వైరస్ ఎటాక్ చేస్తోంది. వీలైనంత వరకు ఇంట్లో ఉంటేనే మంచిది. అమెరికాలో శవాల గుట్టలు పేరుకుపోయాయి.

    క్రేన్లతోనే శవాలు పూడ్చేస్తూ

    క్రేన్లతోనే శవాలు పూడ్చేస్తూ

    బంధువులు కనీసం కడసారి చూసే పరిస్థితి కూడా లేదు. క్రేన్లతోనే శవాలని పూడ్చేస్తున్నారు. మా ఫ్రెండ్ ఫాథర్ రీసెంట్ గా కరోనా వైరస్ భారిన పడి చనిపోయారు. ఆయనను దూరం నుంచి చూడటానికి కూడా వీలుపడ లేదు. అంతగా ఇక్కడి పరిస్థితులు విషమించాయి. అందుకే ఎంత కష్టమైనా బయటకు రాకుండా ఉండండి. ఇండియాలో ప్రభుత్వాలు చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నాయి. ఇక కొంత మంది నిరుద్యోగులు అమెరికాలో చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి ఇక్కడి వారు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నట్లు మాన్య తెలియజేసింది.

    మాన్య కెరీర్ గురించి

    మాన్య కెరీర్ గురించి

    తెలుగులో సానా యాదిరెడ్డి దర్శకత్వం వహించిన బ్యాచ్‌లర్స్ చిత్రంలో హీరోయిన్‌గా కనిపించిన మాన్య.. ఆ తర్వాత సీతారామరాజు, దేవా, ఇంగ్లీష్ పెళ్లాం ఈస్ట్ గోదావరి మొగుడు దితర చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత తమిళ, మలయాళ, కన్నడ రంగాల్లో పలు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం అమెరికాలో స్థిరపడి బ్యాంకింగ్ సెక్టార్‌లో పనిచేస్తున్నారు.

    Recommended Video

    Anchor Suma Tips To Stay Away From Corona Virus
     నాలుగు లక్షలకు చేరువలో..

    నాలుగు లక్షలకు చేరువలో..

    అమెరికాలో ఇప్పటికే 3లక్షల 67వేల మందికి పైగా కరోనా భారిన పడ్డారు. ఆ సంఖ్య త్వరలోనే నాలుగు లక్షలను తాకనుంది. జనాలు బయటకు వెళ్ళడానికి కూడా ఇష్టపడటం లేదు. 11వేల మంది మరణించారు. త్వరలోనే మరో లక్ష మంది చనిపోయే ఆస్కారం ఉంది. ఇక్కడి ప్రభుత్వాలు వైద్య సిబ్బంది తీరిక లేకుండా కష్టపడుతున్నారు.

    English summary
    former heroine manya facing corona struggling situation in america. And her hometown so many dead bodies found. Manya about usa people and corona victims sad stories.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X