Pavala Shyamala: అత్యంత దీనస్థితిలో అలనాటి స్టార్ కమెడియన్ - తినేందుకు ముద్ద దొరక్క కన్నీళ్లు

Pavala Shyamala: పావల శ్యామల.. ఈ పేరు వింటే చాలు అందరికీ ఆమె చేసిన కామెడీయే గుర్తుకు వస్తుంది. ఆమె మాట్లాడే విధానం, చెప్పే డైలాగులు.. ప్రేక్షకులను చెక్కిలిగింతలు పెడతాయి. కడుపుబ్బా నవ్వేలా చేస్తాయి. ఆమె తెరపై ఏం చేసినా చూసేందుకు ప్రేక్షకులు ఎప్పుడూ ఇష్టంగానే ఉంటారు. ఆమె చాలా సినిమాల్లో నవ్వుతూ, నవ్విస్తూ కనిపించారు. కానీ ప్రస్తుతం ఆమె ఏడుస్తూ, అత్యంత దీన స్థితిలో దర్శనం ఇస్తోంది. ఆమెను చూస్తే గుర్తు కూడా పట్టలేని స్థితికి వచ్చేసింది. కామెడీ చేస్తూ కోట్లు సంపాధించిన ఈమె ప్రస్తుతం కూటికి కూడా దిక్కులేక ఇబ్బంది పడుతోంది.

తినేందుకు ఓ ముద్ద కూడా దొరక్క నటి పావల శ్యామల నానా అవస్థలు పడుతోంది. బతుకు భారంగా మారి.. ఎక్కడికీ వెళ్లలేని స్థితిలోకి చేరిపోయింది. ఓవైపు వయోభారం, మరోవైపు ఆర్థిక సమస్యలు. సాయం చేసేవారు లేక, తిండి పెట్టేవారు కూడా లేక అత్యంత దుర్భర జీవితాన్ని గడుపుతోంది. ఎవరైనా సాయం చేస్తే బాగుంటుందని అంటోందీ స్టార్ కమెడియన్. ఆమెకే తిండి లేదంటే, ఎదిగిన కూతురి ఆరోగ్య పరిస్థితి బాగాలేక మరింత ఇబ్బందులు పడుతోంది. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా తీవ్ర మనోవేదనకు గురవుతోంది.

Senior Actress Pavala Shyamala Facing Financial Problems And Requesting Help For Survival

చాలా కాలంగా నటి పావల శ్యామల ఇబ్బందులు పడతుండగా.. ఇప్పటికి చాలా మంది సాయం చేశారు. కానీ అవన్నీ తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే కల్గించాయి. ఆమెకు వచ్చిన అవార్డులను కూడా అమ్ముకొని ఆ డబ్బుతో నిత్యావసర సరుకులు కొనుక్కుని బుక్కెడు అన్నం తిన్నట్లు గుర్తు చేసుకుంది. ఒక్కోసారి ఐదు రోజులు తిండి లేక పస్తులతోనే పడుకున్న రోజులు కూడా ఉన్నాయని చెబుతూ కన్నీరు పెట్టుకుంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే కూతురుతో పాటు తాను ఏదో ఒకరోజు మంచంలోనే పడి అలాగే చనిపోతామని.. ఆ విషయం బయటకు తెలిసేందుకు కూడా చాలా రోజులు పడుతుందని వివరించింది.

Senior Actress Pavala Shyamala Facing Financial Problems And Requesting Help For Survival

ఆత్మహత్య చేసుకోవాడనికి ధైర్యం చాలక.. చచ్చీచెడి బతుకుతున్నామని నటి పాలవ శ్యామల ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా ఎవరైనా దయతలిచి సాయం చేస్తే బాగుంటుందని.. కనీసం ఆఖరి రోజుల్లో పస్తులు ఉండకుండా బతకగలమని అంటోంది. ఎవరైనా సాయం చేయాలనుకునే వారు అకౌంట్ నెంబర్ 52012871059, ఐఎఫ్ఎస్సీ కోడ్: SBIN0020458, శ్రీకృష్ణానగర్, యూసుఫ్ గూడ బ్రాంచ్, హైదరాబాద్ డబ్బులు పంపవచ్చు. అలాగే సెల్ నెంబర్ 9849175713 లకు సంప్రదించవచ్చు.

నటి పావల శ్యామల, ఆమె కూతురు ఫీర్జాదిగూడలోని ఓ వృద్ధాశ్రమంలో బతుకీడుస్తున్నారు. కనీసం నెలనెలా డబ్బులు కూడా కట్టలేక ఇటీవలే ఇంటికి వెళ్లిపోయారు. ఆమె డబ్బు, మందులు, నిత్యావసర సరుకులు వంటివి ఏవైనా ఇవ్వాలి అనుకునేవారు నేరుగా ఆమెకు ఇంటికి వెళ్లి అందజేయాలి. ముఖ్యంగా సినీ ప్రముఖులు ఎవరైనా ఆమెకు ఒకేసారి పెద్ద మొత్తంలో సాయం చేస్తే ఆమెకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X