సినీ పరిశ్రమలో వరుస విషాదాలు.. ఆ సినిమాలో సమంతకు అమ్మమ్మగా చేసిన సీనియర్ నటి మృతి

ఈ మధ్య కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో వరుసగా విషాద ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇక ఈ ఏడాది అయితే అనేక మంది సినీ సినీ రంగంలోని ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంవత్సరంలోనే సీనియర్ హీరో కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ, సత్యనారాయణ, చంద్ర మోహన్ వంటి దిగ్గజ నటులను తెలుగు సినీ పరిశ్రమ కోల్పోయింది. ఇలా ఎవరో ఒకరు చనిపోవడంతో వరుసగా టాలీవుడ్ కు తీవ్ర కొరత ఏర్పడుతోంది. అయితే తాజాగా మరో సీనియర్ నటి ప్రాణాలు విడిచింది. చాలా ఏళ్ల పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో పని చేసిన ఆమె అనుకోకుండా గురువారం రాత్రి చనిపోయింది.

87 ఏళ్ల వయసు కల్గిన ఆర్. సుబ్బలక్ష్మి ఈరోజు ప్రాణాలు విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆమెను.. కుటుంబ సభ్యులు కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతున్న సుబ్బలక్ష్మీ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. అయితే ఈ విషయాన్ని ఆమె మనుమరాలే స్వయంగా ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా... నటి సుబ్బలక్ష్మి చనిపోయినట్లు స్పష్టం చేశారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు అంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూనే.. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.

Senior Actress R Subbalakshmi Passed Away Due to Health Issues

1936 ఏప్రిల్ 21వ తేదీన పుట్టిన ఈమె నటిగానే కాకుండా సంగీత విద్యాంసురాలిగా కూడా మంచి పేరు తెచ్చుకుంది. దాదాపు 75 సినిమాల్లో నటించిన ఆమె తమిళ నటుడు విజయ్ నటించిన బీస్ట్ సినిమాలో కూడా కనిపించి మెప్పించింది. ముఖ్యంగా తెలుగులో అక్కినేని నాగ చైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా చేసిన ఏమాయ చేశావే సినిమాలో... సమంతకు అమ్మమ్మగా కనిపించి అందరినీ అలరించింది. అలాగే కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా పలు సీరియళ్లు, వాణిజ్య ప్రకటనల్లోనూ మెరిసిందీ సీనియర్ నటి.

Senior Actress R Subbalakshmi Passed Away Due to Health Issues

నటి సుబ్బలక్ష్మి.. కళ్యాణ కృష్ణన్ ను వివాహం చేసుకుంది. వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలుగా ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు పుట్టారు. అయితే సుబ్బలక్ష్మీ చిన్న కుమార్తె తారా కళ్యాణ్ కూడా ప్రముఖ నటి, నృత్యకారిణి. సుబ్బలక్ష్మి, చలన చిత్రంలోకి రాకముందు... జవహర్ బాల భవన్‌లో సంగీత విద్వాంసురాలు, నృత్య శిక్షకురాలిగా పని చేశారు. అంతేకాకుండా 1951 నుండి ఆల్ ఇండియా రేడియోలో కూడా పని చేశారు.

దక్షిణ భారతదేశం నుండి ఆల్ ఇండియా రేడియో మొదటి మహిళా స్వరకర్తగా సుబ్బలక్ష్మి ప్రసిద్ధి చెందారు. అనేక కచేరీలు చేయడంతో పాటు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా చేశారు. అలాగే కొన్ని టెలి ఫిల్మ్‌లు, ఆల్బమ్‌లలో కూడా నటించి మెప్పించింది. ఇంతటి చరిత్ర కల్గన ఈ సినియర్ స్టార్ నటి చనిపోవయిందని తెలియడంతో చాలా మంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె లేకపోవడం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X