కూతురి అందంతో తల్లి వ్యాపారం .. 250 సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్ చీకటి బాగోతం

చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం స్టార్లుగా వెలుగొందుతున్న వారి జీవితం పూల పాన్పు కాదు. వారు ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో కష్టాలు , కన్నీళ్లు, అవమానాలు, చీత్కారాలు ఉంటాయి. వాటన్నింటిని తట్టుకుని నిలబడిన వారే విజేతగా నిలుస్తారు. అయితే ఆత్మీయులు, కుటుంబ సభ్యుల చేతుల్లో మోసపోయిన నటీనటులు కూడా చిత్ర సీమలో అడుగడుగునా కనిపిస్తారు. ఇలాంటి కోవలలోకే వస్తారు హాట్ బాంబ్ షకీలా.

షకీలా.. ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. 16 ఏళ్ల కుర్రాడి నుంచి 90 ఏళ్ల వృద్ధుడి వరకు అంతా ఆమె ఫ్యాన్సే. ఓ 20 ఏళ్లు వెనక్కి వెళితే.. దక్షిణాది చిత్ర పరిశ్రమను, ముఖ్యంగా మలయాళ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేశారు షకీలా. ఈమె సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు మలయాళ అగ్రనటుడు మమ్ముట్టి, మోహన్‌లాల్, సురేష్ గోపీ వంటి స్టార్స్ సైతం తమ సినిమా విడుదలను వాయిదా వేశారంటే అతిశయోక్తి కాదు.

senior actress shakeela made sensational comments on her mother and family

టాప్ హీరోల సినిమాలకు మించి షకీలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించేవి. ఒకానొక దశలో ఆమె రోజుకు రూ.4 లక్షల రెమ్యూనరేషన్ తీసుకునే వారంటే షకీలా రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. కానీ ఇదంతా నాణేనికి ఓ వైపు మాత్రమే. బీగ్రేడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచిన షకీల జీవితమంతా కష్టాలమయం. తన సినిమాలు సూపర్‌స్టార్లకు పోటీగా మారడంతో కొందరు ఆమె చిత్రాలకు ఆటంకం కలిగించేవారని షకీలా పలుమార్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ రాజకీయాలు తట్టుకోలేకే తాను మలయాళం చిత్రాల్లో నటించడం ఆపేయాల్సి వచ్చిందని ఆమె చెప్పారు. 16 ఏళ్ల వయసులోనే నటిగా కెరీర్ ఆరభించిన షకీలా.. దాదాపు 250 చిత్రాల్లో నటించారు. రోజుకు లక్షల్లో సంపాదించినా నమ్మిన వారి చేతుల్లోనే మోసపోయి.. ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు లేక అద్దె ఇంట్లో జీవితం గడుపుతున్నారు. షకీలను జనం మరిచిపోతున్న దశలో గతేడాది బిగ్‌బాస్ 7 తెలుగు సీజన్‌లో ఓ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి షాకిచ్చారు.

senior actress shakeela made sensational comments on her mother and family

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన షకీలా.. తన తల్లి, ఇతర కుటుంబ సభ్యులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చిన్నప్పటి నుంచి బొద్దుగా ఉండేదాన్నని.. స్కూల్‌లో చదివే రోజుల్లోనే కాలేజీ అమ్మాయిలా కనిపించేదాన్నని షకీలా తెలిపారు. రోడ్డుపై వెళ్తుంటే అంతా కళ్లతోనే కొరుక్కు తినేసేవాళ్లని.. తన అందం, ఫిగర్ చూసి తన తల్లి తననే వ్యభిచారిని చేసిందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

కొందరు మగాళ్లను పరిచయం చేసి.. వారి గదికి తీసుకెళ్లేదని షకీలా అన్నారు. ఇలాంటి పనులు చేయనని చెప్పడంతో తన తల్లి తనను తీవ్రంగా కొట్టేదని దీంతో మనసు చంపుకుని ఆమె చెప్పినట్లు చేసేదాన్నని షకీలా ఆవేదన వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా అంతా తన ఫిగర్‌ను చూసేవాళ్లు కానీ, తన నటనను ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. ప్రస్తుతం షకీలా వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి.

More from Filmibeat

Read more about: shakeela movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X