ఐశ్వర్యరాయ్‌తో సీనియర్ నటి శోభన.. ఆమె సినిమా కోసం కొరియోగ్రాఫర్‌గా
సీనియర్ నటి శోభన గురించి అందరికి తెలిసే ఉంటుంది. మళయాళం నటి అయినప్పటికీ ఇతర భాషల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. భరత నాట్యం డ్యాన్సర్ గా ఆమె ఎక్కువగా క్రేజ్ అందుకున్నారు. అయితే శోభన చంద్రకుమార్ ఒక సినిమాకు స్పెషల్ కొరియోగ్రాఫర్ గా కూడా వర్క్ చేశారు. ముఖ్యంగా ఐశ్వర్యారాయ్ సినిమా ద్వారా మంచి గుర్తింపు దక్కించుకున్నారు.

డ్యాన్స్ స్కిల్స్ చూసి..
శోభన డ్యాన్స్ స్కిల్స్ చూసి అప్పట్లో హీరోయిన్స్ కూడా ఫ్యాన్స్ అయిపోయేవారు. అభినందన, నారీ నారీ నడుమమురారి వంటి సినిమాలతో మంచి క్రేజ్ అందుకున్నారు. 90ల కాలంలో బిజీ యాక్టర్ గా శోభన తమిళ్ తెలుగు మలయాళం భాషల్లో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. దాదాపు సీనియర్ సౌత్ స్టార్ హీరోలందరితో శోభన వర్క్ చేశారు.

స్పెషల్ ఫోటో..
ఇకపోతే రీసెంట్ గా శోభన తన ఇన్స్టాగ్రామ్ లో ఒక స్పెషల్ ఫోటో పోస్ట్ చేశారు. ఐశ్వర్యారాయ్ తో ఆమె కనిపించడంతో అసలు శోభనకు ఆమెకు సంబంధం ఏమిటి అని అందరిలో ఒక సందేహం మొదలైంది. అయితే ఐశ్వర్యరాయ్ ఎక్కువగా శోభన దగ్గర నుంచే డ్యాన్స్ మెళకువలు నేర్చుకుందట. ఇక ఆమె సినిమాకు కూడా వర్క్ చేసినట్లు ఫొటోతో క్లారిటీ వచ్చేసింది.

ఆ సినిమా కోసం..
మణిరత్నం రావన్ సినిమాలో ఒక పాట కోసం శోభనను సెలెక్ట్ చేసుకున్నారు. అందులో ఆమె ఒక సాంగ్ కోసం కొరియోగ్రాఫర్ గా వర్క్ చేసినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. నటి శోభన డ్యాన్స్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ట్రెడిషినల్ డ్యాన్స్ లోనే కొత్త తరహా మెళకువలు నేర్పడంలో ఆమె స్టైలే వేరని ఐశ్వర్యారాయ్ కూడా పలు ఇంటర్వ్యూలో చెప్పారు.
Recommended Video

మళయాళంలోనే..
ఇక చివరగా శోభన తెలుగులో నిరీక్షణ అనే సినిమా చేసింది. ఆ తరువాత రెండు మూడు సినిమాలో గెస్ట్ రోల్స్ చేసింది. ప్రస్తుతం ఆమె మలయాళం సినిమాలతోనే ఎక్కువగా బిజీగా ఉంటోంది. అలాగే అప్పుడప్పుడు పెద్ద సినిమాలకు అవసరం అయితే ట్రెడిషినల్ సాంగ్స్ కోసం కొరియోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











