డ్రస్ మార్చుకోవడానికి వెళ్తే .. కార్‌వాన్ వద్ద అలాంటి అనుభవం.. బయటపెట్టిన సీనియర్ నటి

సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులకు పెద్దగా గౌరవం ఉండదు అనే మాట తరచుగా వినిపిస్తూ ఉంటుంది. ఇప్పటి దాకా ఎన్నో సినిమాల్లో పలు సపోర్టింగ్ రోల్స్ పోషించిన వైజాగ్ జగదీశ్వరి సెట్స్ లో తమకు ఎదురయ్యే దారుణమైన అవమానాలను బయట పెట్టింది. మరి ఇంతకీ ఆమె ఎదుర్కొన్న ఆ చేదు అనుభవాలు ఏంటి? ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులతో ఎలా ప్రవర్తిస్తారు అనే ఇంట్రెస్టింగ్ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

వైజాగ్ జగదీశ్వరి... ఈవిడ ఇప్పటి వరకు ఎందరో స్టార్ హీరోల సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు చేసింది. అయితే లవర్ అనే మూవీ చేస్తున్న సమయంలో తనకు నరకం ఏంటో కనిపించింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. పెద్ద బ్యానర్లు, పెద్ద డైరెక్టర్లతో సినిమా చేసినప్పుడు వాళ్లు కూడా డబ్బులు ఇవ్వరా? అనే ప్రశ్నకు వైజాగ్ జగదీశ్వరి స్పందిస్తూ పెద్ద బ్యానర్లు తమలాంటి వాళ్ళను అస్సలు కేర్ చేయరంటూ షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది.

Senior Artist Vizag Jagadeeswari serious allegations on directors for treating bad in the Shooting

దిల్ రాజు తనకు దిల్ రాజు తనకు ఒక్కసారి కనిపిస్తే ఆయన ముందు తన గోడును వెల్లబోసుకోవాలని ఉందంటూ ఆవేదనను వ్యక్తం చేసింది. రాజ్ తరుణ్ హీరోగా చేసిన లవర్ మూవీ షూటింగ్ టైంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను తాజా ఇంటర్వ్యూలో బయట పెట్టింది వైజాగ్ జగదీశ్వరి.

పెద్ద ఆర్టిస్టులకు మాత్రమే సినిమా ఇండస్ట్రీలో వాల్యూ ఉంటుందని, చిన్న ఆర్టిస్టులకు మాత్రం టిఫిన్ నుంచి బట్టలు మార్చుకోవడం వరకు కూడా అన్ని ఇబ్బందులేనని చెప్పుకొచ్చింది. ఎంతమంది మగాళ్లు ఉన్నా సరే అక్కడే అందరి ముందు బట్టలు మార్చుకోవాల్సి వస్తుందని, క్యారవాన్ కూడా ఇవ్వరని షాకింగ్ విషయాన్ని రివీల్ చేసింది.

మొదటి రోజే లవర్ సినిమా షూటింగ్ సెట్లో షార్ట్ లో భాగంగా తాను ఊడ్చుకుంటూ అలా వెళ్ళిపోవాలని, కానీ తనెవరో తెలియని కెమెరా మెన్ కేవలం కెమెరాలో చీపురు కనిపించాలి... నువ్వు ఎందుకు కనిపిస్తున్నావు అంటూ సీరియస్ అయ్యాడని తెలిపింది. ఆ తర్వాత ఎవరో తాను చాలా సినిమాలు చేసిన సీనియర్ ఆర్టిస్ట్ ను అనే విషయాన్ని చెప్పడంతో ఆయన మరునాడు సారీ చెప్పారని గుర్తు చేసుకుంది.

ఇక ఫుడ్ దగ్గర కనీసం మనిషిలా కూడా చూడరని చెప్పుకొచ్చింది. ఈగలు ముసిరిన ఆహారాన్నే పెడతారని, ఆకలితో సంబంధం లేకుండా ఒక ఇడ్లి లేదా ఒక దోశ పెడితే అదే తినాలని వైజాగ్ జగదీశ్వరి వెల్లడించింది.

మరొక రోజు కో డైరెక్టర్ తనను చీర మార్చుకోమన్నారని, ఎంతోమంది ఉండగా కొంతమందికి మాత్రం క్యారవాన్ ఇచ్చారని లవర్ సెట్స్ లో జరిగిన సంఘటనను మరోసారి కళ్ళ ముందుకు తీసుకొచ్చింది. అయితే కో డైరెక్టర్ క్యారవాన్ లో తనను డ్రెస్ మార్చుకోమన్నారని, కానీ అక్కడున్న అబ్బాయి మాత్రం క్యారవాన్ లోకి అడుగు కూడా పెట్టనివ్వలేదని జగదీశ్వరి చెప్పింది.

దీంతో అక్కడ చిన్న వాగ్వాదం జరగ్గా మరి నీ ముందే మార్చుకోమంటావా చెప్పు అని ప్రశ్నిస్తే, కో-డైరెక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చి సర్ది చెప్పారని వెల్లడించింది. మొత్తానికి ఆర్టిస్టులు సీనియర్ అయినా, జూనియర్ అయినా సెట్స్ లో దారుణమైన పరిస్థితులు ఉంటాయని వివరించింది. స్టార్స్ కు తప్ప మిగతా వాళ్లకు పెద్దగా గౌరవం ఉండదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X