"200 కోట్ల అప్పులు.. అవి తీర్చేందుకు శ్రీదేవి హత్య.. బయోపిక్ వద్దనడానికి కారణాలేంటంటే?"
అలనాటి అందాల తార శ్రీదేవి గురించి తెలియని భారతీయ సినీ ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. అద్భుతమైన అందం, అంతకు మించిన నటనతో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ఈమెకు కోట్లలో అభిమానులు ఉన్నారు. ఎంతో మంది ఆమెను భార్యగా కావాలని కోరుకోగా.. ఆమె మాత్రం ప్రొడ్యూసర్ బోని కపూర్ ను ప్రేమించి పెళ్లాడింది. అయితే ఎవరూ ఊహించని రీతిలో ఈమె దుబాయ్ లో అకాల మరణం చెందింది. ఆమె చావు సహజ మరణం కాదని.. ఏదో జరిగిందని చాలా మంది ఊహాగానాలు వ్యక్తం చేశారు.
ముఖ్యంగా మత్తులో ఉన్న ఆమె బాత్ టబ్ లో పడి చనిపోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. భర్త ఆమెతో పాటే లేకపోవడంతో అతడే చంపి ఉంటాడని పెద్ద ఎత్తున పుకార్లు వచ్చాయి. కానీ ఆమెది సహజ మరణమేనని నీళ్లు మింగే ఆమె చనిపోయిందని.. వైద్యులు నిర్దారించారు. ఇలా ఆ వార్తలకు చెక్ పడగా.. మరోసారి ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా శ్రీదేవి భర్త బోని కపూర్ ఆమె బయోపిక్ రానివ్వనని చెప్పగా... అంతా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఓ సీనియర్ డైరెక్టర్ అయితే ఈమె ఇలాగే చనిపోయిందంటూ ఓ కథ కూడా చెప్పేశాడు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీదేవి చనిపోయేనాటికి చాలా స్ట్రెస్ లోనే ఉందని సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ చెప్పారు. అంతకు ముందే తాను ఆమెను కలిశానని.. తన సోదరే ఆమెపై ఆస్తికోసం కేసు పెట్టినట్లు వివరించారు. ఇదే విషయం తాను నేరుగా శ్రీదేవిని అడగ్గా.. తాను ఏం మాట్లాడలేదని వివరించాడు. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న ఆమె.. చూసేందుకు లావుగా ఉన్న బోని కపూర్ ను పెళ్లి చేసుకోవడానికి ప్రేమ ఒక్కటే కారణం అని తెలిపారు. ఆయన చాలా బాగా చూసుకునే వారని.. అందుకే శ్రీదేవి ఎంతో మంది వచ్చినా అతడిని పెళ్లి చేసుకుందని డైరెక్టర్ గీతాకృష్ణ వెల్లడించారు.
అలాగే కెరియర్ లో చాలా హ్యాపీగా ఉన్న ఆమె పర్సనల్ లైఫ్ లో చాలానే సమస్యలు ఎదుర్కుందని.. ముఖ్యంగా ఆమె తల్లికి వైద్యం వికటించి చివరకు పిచ్చిది అయి చనిపోయిందని చెప్పుకొచ్చారు. ఆ తర్వా చెల్లెలు ఆమెపై కేసు పెట్టడం.. ఆ తర్వాత కొంత కాలానికే బోని కపూర్ 200 కోట్ల అప్పులు పాలవడం జరగిందని అన్నారు. ఆ అప్పుల నుంచి తేరుకోవడాకని, బయట పడడానికి.. ఆమెను చంపేశారని వివరించారు. అయితే ఆమెపై ఇన్సూరెన్స్ ఉండడం వల్ల ఆ డబ్బుల కోసమే ఆమెను హత్య చేశారని తెలిపారు.

భర్త బోని కపూర్ రెండు రోజులు దుబాయ్ లో లేనట్లు చూపించారని.. అసలు దుబాయ్ లో మేనేజ్ చేయడానికి ఛాన్స్ ఉండకపోయినా బాగానే మేనేజ్ చేశారంటూ వెల్లడించారు. అలా వచ్చిన డబ్బులతో అప్పులు తీర్చారని.. ఆ విషయం వాళ్లు పిల్లలు జాన్వీ, ఖుషీ కపూర్ లకు కూడా తెలిసే ఉంటుందని డైరెక్టర్ గీతా కృష్ణ వివరించారు. కానీ అటు తల్లి చనిపోవడం.. ఇటు తండ్రి కూడా దూరం అవుతాడనే వాళ్లు చప్పుడు చేయకుండా ఉండే ఛాన్స్ ఉందని స్పష్టం చేశారు. ఈ నిజాలు అన్నీ బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే శ్రీదేవి భర్త బోని కపూర్.. ఆమె బయోపిక్ రానివ్వనంటున్నారని సెన్సేషనల్ కామెంట్లు చేశారు.


Click it and Unblock the Notifications











