"జూనియర్ ఎన్టీఆర్ ముందు నాగచైతన్య పిల్ల బచ్చా.. ఆయనకు యాక్టింగే రాదు"
ఒకప్పుడు టాలీవుడ్ లో అదిరిపోయే సినిమాలు తీసి టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు గీతాకృష్ణ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే చాలా ఏళ్ల క్రితమే సినిమాలు తీయడం మానేసిన ఈయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముందు.. నాగ చైతన్య పిల్లా బచ్చా అంటూ చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ గ్రేట్ యాక్టర్ అని.. నాగ చైతన్యకు అసలు యాక్టింగే రాదంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1987లో సంకీర్తన అనే సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టాడు డైరెక్టర్ ఎస్. గీతా కృష్ణ. అయితే తన మొదటి చిత్రంతోనే దర్శకుడి ఉత్తమ మొదటి చిత్రంగా నంది అవార్డును గెలుచుకున్నాడు. ఆ తర్వాత కోకిల, కీచురాళ్లు, ప్రియతమా, సర్వర్ సుందరం గారి అబ్బాయి, కాఫీబార్ వంటి సూపర్ డూపర్ హిట్టు చిత్రాలను తెరకెక్కించాడు. కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళంలో కూడా టైం, నిమిడంగల్ అనే సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇక ఆ తర్వాత నుంచి ఆయన సినిమాలు చేయలేదు.

అయితే తాజాగా సీనియర్ డైరెక్టర్ గీతాకృష్ణ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అక్కడే షాకింగ్ కామెంట్లు చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా ఇంటర్వ్యూ చేసే యాంకర్.. దేవర, తండేల్ సినిమాలు ఒక సమయంలో విడుదల కానున్నాయి... పోటీ ఎలా ఉండబోతుందని అడిగారు. దీనికి డైరెక్టర్ గీతా కృష్ణ.. జూనియర్ ఎన్టీఆర్ గ్రేట్ యాక్టర్ అని ఆయన సినిమాకు నాగ చైతన్య సినిమాకు పోటీ ఏంటని అన్నారు. అలాగే నాగ చైతన్య అప్ కమింగ్ హీరో అని.. ఆయనకు సరిగ్గా నటించడం కూడా రాదంటూ చెప్పుకొచ్చారు.
అంతేతాకుండా నాగ చైతన్య సినిమాలు ఆడడానికి కారణం.. నాగార్జున కొడుకు అని ఒకే ఒక్క కారణం అంటూ వివరించారు. అలాగే తండేల్ సినిమా కథ బాగుంటే చెప్పలేం కానీ.... లేదంటే ఆ సినిమా పెద్దగా ఆడే అవకాశం లేదని వెల్లడించారు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా బాగా ఆడుతుందని అన్నారు. అలాగే నాగ చైతన్య చేసిన వాటిల్లో ఒకే ఒక్క వెబ్ సిరీస్ బాగా ఆడిందని.. మరేవీ ఆడలేదంటూ గీతా కృష్ణ షాకింగ్ కామెంట్లు చేశారు.

ప్రస్తుతం నాగ చైతన్య సినిమా తండేల్ ఆడేందుకు ఆ మూవీ టీం బాగానే ప్లాన్ చేస్తుందని.. ముఖ్యంగా హీరోయిన్ సాయి పల్లవిని తీసుకొచ్చి వారి సినిమాను సక్సెస్ చేసుకోవాలనుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఒక సౌందర్య, సుహాసునిలా సాయి పల్లవి కూడా మంచి హీరోయిన్ అని.. ఆమె వల్లే ఈ సినిమా ఆడే అవకాశం ఎక్కువగా ఉందని వివరించారు. గ్లామర్ రోల్స్ చేయనని, పద్దతైన బట్టలు మాత్రమే వేసుకుంటానని, లిప్ లాక్ సీన్లు చేయనని చెప్పినా.. ఆమె నటనను, డ్యాన్స్ ను మెచ్చి సాయి పల్లవికి ఛాన్సులు ఇస్తున్నారని తెలిపారు.


Click it and Unblock the Notifications











