10 మందితో ఎఫైర్స్.. అందుకే మొదటి భార్యతో విడాకులు.. సిద్దార్థ్‌పై స్టార్ డైరెక్టర్ కామెంట్లు!

2003లో బాయ్స్ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన హీరో సిద్దార్థ్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన టాలెంట్ కల్గిన ఈయన తాజాగా హీరోయిన్ అదితి రావు హైదరితో నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే ఇది అటు అదితికి ఇటు సిద్దార్థ్ కు రెండో పెళ్ళి కావడంతో గతంలో వాళ్లను పెళ్లి చేసుకుంది ఎవరు, ఎందుకు విడాకులు తీసుకున్నారని అంతా ఆరాలు తీస్తున్నారు. ఈక్రమంలోనే ఓ సీనియర్ డైరెక్టర్ హీరో సిద్దార్థ్ కు 10 మంది ఎఫైర్ ఉందని, వారిద్దరూ విడాకులు ఎందుకు తీసుకున్నారో కూడా చెప్పాడు పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

బాయ్స్ సినిమాతో సినీ కెరియర్ ప్రారంభించిన ఈయన ఇప్పటికీ హీరోగా కొనసాగుతూనే ఉన్నాడు. ప్రస్తుతం 44 ఏళ్ల వయసు కల్గిన సిద్దార్థ్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఇటీవలే చిన్నా సినిమాతో వచ్చి సూపర్ హిట్ కొట్టిన ఈయన.. తాజాగా హీరోయిన్ అదితి రావు హైదరిని పెళ్లి చేసుకున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. సీక్రెట్ గా వీరిద్దరూ తెలంగాణలోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నట్లు పుకార్లు లేచాయి. కానీ తాజాగా వీరిద్దరూ ఈ వార్తలపై స్పందించారు.

Senior Director Geetha Krishna Shocking Comments About Siddharth And Aditi Rao Hydari Marriage

ఇద్దరూ కలిసి నిశ్చితార్థం చేసుకున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ఉంగరాలు మార్చుకున్న వీరిద్దరూ ఉంగరాలు చూపిస్తూ దిగిన ఫొటోను ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ.. ఆమె ఓకే చెప్పింది.. ఎంగేజ్డ్ అని, అతడు ఓకే చెప్పాడు ఎంగేజ్డ్ అని రాసుకొచ్చారు. ఇలా కేవలం నిశ్చితార్థం మాత్రమే చేసుకున్నట్లు క్లారిటీ ఇవ్వగా.. పెళ్లి ఎప్పుడు అనేది మాత్రం చెప్పలేదు. కానీ త్వరలోనే వీరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా వీరిద్దరి బంధంపై సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ స్పందించారు.

Senior Director Geetha Krishna Shocking Comments About Siddharth And Aditi Rao Hydari Marriage

ముఖ్యంగా యాంకర్.. అదితి, సిద్దార్థ్ పెళ్లి చేసుకోబోతున్నారు మీరేమంటారు అని అడగ్గా... ఫస్ట్ వాళ్లిద్దరికీ కంగ్రాట్యులేషన్స్ చెప్పాలని అన్నారు. ఆ తర్వాత ఈ అమ్మాయి కూడా చాలా మందికి ట్రై చేస్తుంది, అటు సినిమాలు కూడా క్లిక్ అవ్వట్లేదని చెప్పుకొచ్చారు. సినిమాలతో పాటు ఓ వెబ్ సిరీస్ కూడా చేసినా పెద్దగా బ్రేక్ రాలేదని తెలిపారు. అలాగే హీరో సిద్దార్థ్ గురించి మాట్లాడుతూ.. వాడు చాలా ఓవర్ యాక్షన్ చేస్తాడని వివరించాడు.

Senior Director Geetha Krishna Shocking Comments About Siddharth And Aditi Rao Hydari Marriage

వీడి ఫస్ట్ పెళ్లే బూమరాంగ్ అని... వీడో పది మంది అమ్మాయిలతో అఫైర్ నడుపుతుంటే ఎవరైనా వీడితో ఎందుకు కలిసుంటారు.. అందుకే మొదటి పెళ్లాం వీడికి విడాకులు ఇచ్చిందంటూ చెప్పుకొచ్చాడు. అలాగే హీరో సిద్దార్థ్ కు చాలా బలుపు అని.. సినిమాలు బాగానే చేసినా యాటిట్యూడ్ ఎక్కువగా చూపిస్తాడంటూ ఫైర్ అయ్యారు. వాడిచ్చే బిల్డప్ అస్సలే తట్టుకోలేమంటూ చెప్పుకొచ్చారు. అఫైర్స్ వల్లే విడాకులు తీసుకున్న ఈయన ఇప్పుడైనా అదితి రావు హైదరితో చక్కగా కలిసుంటే చాలని కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X