twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Jr ఎన్టీఆర్, పవన్, బాలయ్య.. వీళ్ళతో ప్రాజెక్టులు ఎందుకు క్యాన్సల్ అయ్యాయంటే: కృష్ణవంశీ

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్నమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న అతికొద్ది దర్శకులలో కృష్ణవంశీ ఒకరు. గులాబీ, మురారి, నిన్నే పెళ్ళాడుతా, చందమామ, ఖడ్గం, శ్రీ ఆంజనేయం ఇలా విభిన్నమైన తరహాలో ఫ్యామిలీ ఆడియన్స్ ను థ్రిల్లర్ ఫ్యాన్స్ ఎక్కువగా ఆకట్టుకుంటూ వచ్చారు. అయితే ఆయన గతంలో జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ అలాగే బాలకృష్ణ లతో కూడా సినిమాలు చేయాలని అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టులో అనుకోకుండా క్యాన్సిల్ అయ్యాయి. ఆ విషయాలను ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు.

    ఆ స్టైల్ లో సినిమాలు

    ఆ స్టైల్ లో సినిమాలు

    కృష్ణవంశీ ఒక స్టార్ హీరో ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని సినిమా చేయడం కంటే కూడా కథలో ఆ హీరో ఎంతవరకు ఉపయోగపడతారు అనేది ఆలోచించి సినిమాను తెరపైకి తీసుకు వస్తూ ఉంటారు. ఒకప్పుడు స్టార్స్ చాలా వరకు ఆయనతో సినిమాలు చేయడానికి ఎంతో ఆసక్తి చూపేవారు. ఇక కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన రంగా మార్తాండ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాకుంది. ఈ సందర్భంగా ఆయన సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇస్తున్న ఇంటర్వ్యూలలో అనేక విషయాలను తెలియజేస్తున్నారు.

    బాలయ్యతో సినిమా

    బాలయ్యతో సినిమా

    కృష్ణవంశీ మాట్లాడుతూ.. మొదట బాలకృష్ణ గారితో 2015 లో ఒక సినిమా చేయాలని అనుకున్నాను. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా సిద్ధమయ్యాయి. ఆయనకు నచ్చినట్టుగానే కొన్ని మార్పులు కూడా చేయడం జరిగింది. అయితే అందులో అమితాబచ్చన్ ఒక ముఖ్యమైన పాత్రలో కూడా నటిస్తే బాగుంటుంది అని అనుకున్నాను. బాలయ్య కూడా అమితాబ్ నటిస్తేనే సినిమా చేద్దామని అన్నారు. కానీ అమితాబచ్చన్ అందుబాటులోకి రాలేదు. దీంతో ఆ ప్రాజెక్టులో మరొకరిని ఊహించుకోలేక బాలయ్య పట్టించుకోలేదు అని అన్నారు.

    ఎన్టీఆర్ కోసం

    ఎన్టీఆర్ కోసం

    ఇక జూనియర్ ఎన్టీఆర్ తో కూడా మరో సినిమా చేయాలని అనుకున్నట్లు కృష్ణవంశీ తెలియజేశాడు. అసలైతే మొదట ఎన్టీఆర్ తో సినిమా చేయాలని అనుకున్నప్పుడు అతని కోసం ప్రత్యేకంగా కథ ఏమి తయారు చేయలేదు. కానీ నేను చెప్పిన రాఖీ పాయింట్ అతనికి బాగా నచ్చింది. అదే సినిమా చేద్దామని చాలా హార్డ్ వర్క్ చేసి ఆ సినిమాలో చాలా అద్భుతంగా నటించాడు. ప్రతి డైలాగ్ కూడా అతను షూటింగ్ స్పాట్లోనే నేర్చుకుని అక్కడే చెప్పేసేవాడు. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ చేయాలనుకున్నప్పటికీ కూడా వివిధ కారణాల వల్ల కుదరలేదు అని కృష్ణ వంశీ అన్నాడు.

    పవన్ కళ్యాణ్ తో..

    పవన్ కళ్యాణ్ తో..

    ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ప్రస్తుతం.. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగ్గట్టుగా సరైన కథ సెట్ అయితే మాత్రం అతనితో తప్పకుండా సినిమా చేస్తాను. అతని పాలిటిక్స్ లో ఒక మంచి ఆలోచనతో వెళ్లిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. చాలా ఎఫర్ట్ పెట్టి అందులో కొనసాగుతున్నాడు. నేను అతన్ని చివరిసారిగా రామ్ చరణ్ పెళ్లిలో కలిసాను. అప్పుడు ఒక సినిమా కూడా చేయాలని అనుకున్నాను. ఒకవేళ అది మొదలై ఉంటే ఊహించని రేంజ్ లో ఉండేది. కానీ ఆ తర్వాత మళ్లీ వర్కౌట్ కాలేదు అని కృష్ణవంశీ తెలియజేశాడు.

    పొలిటికల్ సినిమా

    పొలిటికల్ సినిమా

    నాకు కేవలం రెగ్యులర్ ఫ్యామిలీ కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా ఒక మంచి పొలిటికల్ సినిమా కూడా చేయాలని ఉంది. సంతకం అనే ఒక టైటిల్ మీద ఒక పొలిటికల్ కథ రాసుకున్నాను. ప్రస్తుతం రాజకీయాలు ఎలా డెవలప్ అవుతున్నాయి అనేది చాలా బాగా చూస్తున్నాను. అలాగే అందులో ఉండే విభిన్నమైన పాలిటిక్స్ వార్స్, రూలర్స్ వాటి విధానాలు ఏ విధంగా మారుతున్నాయి అనే అంశాలు కూడా సినిమాలో హైలెట్ చేయాలని ఉన్నట్లు కృష్ణవంశీ తెలియజేశాడు.

    English summary
    Senior director krishna vamsi clarification on his shelved projects
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X