Jagapathi Babu : ఆడపిల్లలతో అలా .. జగ్గూభాయ్‌లో ఇన్ని షేడ్స్ ఉన్నాయా, వీడియో వైరల్
ఒకప్పుడు ఫ్యామిలీ స్టార్‌గా మహిళా ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుని శోభన్ బాబు తర్వాత అంతటి ఫేమ్‌ను సంపాదించుకున్నారు జగపతిబాబు. అవకాశాలు తగ్గిన తర్వాత తనను తాను మార్చుకుని విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి, ఇప్పుడు దక్షిణాది ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ నటుడిగా నిలిచారు జగపతి బాబు. కోట్ల ఆస్తి ఉన్నా, స్టార్ డమ్ ఉన్నా సింపుల్‌గా ఉండటానికే ప్రయత్నిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు జగ్గూభాయ్.
జగపతిబాబు తండ్రి వీబీ రాజేంద్రప్రసాద్ బడా నిర్మాత, దర్శకుడు. జగపతి ఆర్ట్స్ బ్యానర్‌పై అలనాటి అగ్రనటులతో సినిమాలు తీశారు. దీంతో జగపతి బాబు చాలా ఈజీగా ఇండస్ట్రీలోకి వచ్చినా నటుడిగా స్థిరపడటానికి ఎంతో కష్టపడ్డారు. నటన , డ్యాన్స్ రాదని ఎన్నో మాటలు పడ్డారు. కానీ వాటిని తట్టుకుని నిలబడి తన కంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను దక్కించుకున్నారు.

కొందరు చేసిన మోసం వల్ల వందల కోట్ల ఆస్తి పోవడంతో ఆర్ధికంగానూ ఎంతో ఇబ్బందిపడ్డారు . ఇలాంటి దశలో ఎవరైనా అవకాశం ఇవ్వకపోతారా అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశానని జగపతి బాబు పలుమార్లు తెలిపారు. ఈ క్రమంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ లెజెండ్‌లో చేసిన విలన్ పాత్ర జగపతి బాబు జీవితాన్ని మలుపు తిప్పింది. అప్పటి నుంచి విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తీరిక లేకుండా గడుపుతున్నారు.
రీసెంట్‌గా ఇండియాను ఊపేస్తోన్న అల్లు అర్జున్ - సుకుమార్‌ల మాస్ మసాలా ఎంటర్‌టైనర్ పుష్ప 2 ది రూల్‌లో జగపతి బాబు మరోసారి విలన్‌గా నటించారు. కేంద్రమంత్రి ప్రతాప్ రెడ్డి రోల్‌లో ఆయన నటన ఆకట్టుకుంది. అయితే పుష్ప 2లో జగపతిబాబు క్యారెక్టర్ కొద్దిసేపే కనిపించగా.. పార్ట్ 3లో మాత్రం ఆయన ఉగ్రరూపం చూపిస్తారని అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. తన తమ్ముడిని, తమ్ముడి కొడుకుని చంపిన పుష్పరాజ్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రతాప్ రెడ్డి ఏం చేశాడో పుష్ప 3లో చూపిస్తారని చర్చించుకుంటున్నారు.
ఇక తొలి నుంచి అందానికి , ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తారు జగపతి బాబు. తన ఫాంహౌస్‌లో ప్రకృతి మధ్య గడుపుతూ చద్దన్నం, అవకాయ పచ్చడి తింటూ గడిపేస్తారు . 60 ప్లస్‌లోనూ చెక్కు చెదరని గ్లామర్, ఫిట్‌నెస్‌తో కుర్రాళ్లకి పోటీ ఇస్తున్నారు జగ్గూ భాయ్ . సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్న ఆయన తన సినిమాలు, వ్యక్తిగత వివరాలను ఎప్పటికప్పుడు పంచుకుంటున్నారు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆయన పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
ఆడపిల్లలు, ఇతర ఆత్మీయులతో సరదాగా గడిపిన జగపతి బాబు గోరింటాకు పెట్టించుకున్నాడు. ఈ వీడియోకు ఆడపిల్లలతో రంగుల రంగేలి అన్న క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతుండగా.. ఆయనపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి ఇంకేందుకు ఆలస్యం జగపతి బాబు చిలిపి పనులు మీరూ చూసేయండి.


Click it and Unblock the Notifications











