ఆస్తి లేదని చులకన .. ఆటోలో వచ్చి ఆఫర్ ఇస్తామంటూ, దారుణంగా టాలీవుడ్ స్టార్ హీరో పరిస్ధితి
డబ్బుకు లోకం దాసోహం అన్న సంగతి తెలిసిందే. ఎంతటి వాడైనా సరే డబ్బు లేకుంటే జీరో . డబ్బు ఉన్నప్పుడు చుట్టూ చేరి భజన చేసే జనాలు.. మన దగ్గర కాసులు లేనప్పుడు క్షణం కూడా ఉండరు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరికీ ఇది అనుభవమే. తెలుగులో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జగపతిబాబు తన జీవితంలో ఇలాంటి పరిస్ధితిని ఎదుర్కొన్నట్లు చెప్పి ఎమోషనల్ అయ్యారు. ఈ వివరాల్లోకి వెళిేత..
జగపతిబాబు తండ్రి వీబీ రాజేంద్రప్రసాద్ బడా నిర్మాత, దర్శకుడు. జగపతి ఆర్ట్స్ బ్యానర్‌పై అలనాటి అగ్రనటులతో సినిమాలు తీశారు. బలమైన సినీ నేపథ్యం ఉండటంతో జగపతి బాబు ఇండస్ట్రీలోకి చాలా ఈజీగా ప్రవేశించారు. కానీ నటుడిగా నిలదొక్కుకోవడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు. మొదట్లో సినిమాలు ఫ్లాప్ కావడంతో పాటు నటన, డ్యాన్స్‌లపై ఆయన విమర్శలను ఎదుర్కొన్నారు. కానీ వాటన్నింటిని తట్టుకుని నిలబడిన జగపతి .. ఆంధ్రుల సోగ్గాడు శోభన్ బాబు తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఫేవరెట్ హీరోగా నిలిచారు.

కొత్త హీరోల ఎంట్రీతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారారు జగపతి . మధ్యలో అవకాశాలు రాకపోవడం, వందల కోట్ల ఆస్తి పోవడంతో ఆర్ధికంగానూ ఎంతో ఇబ్బందిపడ్డారు . ఇలాంటి దశలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ లెజెండ్‌లో విలన్‌గా అవతారమెత్తి కొత్త ట్రెండ్ సెట్ చేశారు. ఈ సినిమా తర్వాత జగపతి బాబు దశ తిరిగింది. వరుసపెట్టి విలన్ రోల్స్ ఆయనను వెతుక్కుంటూ రావడంతో జగపతి బిజీ అయిపోయారు. ఆయన వేసిన బాటలో పలువురు సీనియర్ హీరోలు కూడా ప్రతినాయక పాత్రలు వేస్తున్నారు.
60 ప్లస్‌లోనూ చెక్కు చెదరని గ్లామర్‌తో కుర్రాళ్లకి పోటీ ఇస్తున్నారు జగపతి బాబు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్న ఆయన తన సినిమాలు, వ్యక్తిగత వివరాలను ఎప్పటికప్పుడు పంచుకుంటున్నారు. ఇటీవల వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న ఆయన.. తన కెరీర్, ఎదుర్కొన్న ఇబ్బందులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే తనకు లెజెండ్ సినిమాలో అవకాశం రావడానికి ముందు జరిగిన పరిణామాలను వివరించారు.

తను లాండ్ లైన్, మొబైల్ పట్టుకుని తిరిగేవాడని .. ఎవరైనా ఫోన్లు చేస్తే బాగుండు అనుకునేవాడినని జగపతి బాబు తెలిపారు. నాన్నగారి చేతికర్ర పట్టుకుని తిరగడం నాకు అలవాటని.. అలా ఓ రోజున ఇంట్లో అటు ఇటు తిరుగుతుండగా గేట్ ఓపెన్ చేసి ఉండటంతో ఓ వ్యక్తి ఆటోలో వెళ్తూ నన్ను చూశాడని ఆయన వెల్లడించారు. సినిమా తీద్దామనుకుంటున్నానని.. అతని గెటప్ చూస్తే సినిమా వాడిలా కనిపించలేదని డైరెక్టర్ ఎవరు అని అడగ్గా నేనే డైరెక్టర్, నేనే హీరో, నేనే ప్రొడ్యూసర్ అని చెప్పాడని అంటే తన పరిస్ధితి అంతటి చులకనగా ఉందని జగపతి బాబు తెలిపారు.
అయితే తాను ఫోటో సెషన్ చేయడం తన కెరీర్‌కు బాగా హెల్ప్ అయ్యిందని దానిని బోయపాటి చూసి లెజెండ్‌లో అవకాశం ఇచ్చేందుకు ముందుకొచ్చారని తెలిపారు. అయితే ప్రాజెక్ట్ కొద్దిరోజులు ఆలస్యం కావడంతో తనకు టెన్షన్ వచ్చిందని.. కొద్దిరోజులకు శ్రీను కథ చెప్పాడని, రెమ్యునరేషన్ దగ్గర తాను ఒక ఫిగర్ అనుకున్నానని.. వాళ్లు ఇంతే ఇస్తామని వాళ్లు మరో ఫిగర్ చెప్పారని జగపతి బాబు అన్నారు. నేను అనుకున్నదాని కంటే డబుల్ అమౌంట్ చెప్పారని.. కేవలం నా మీద ఇష్టం, గౌరవంతో ఆఫర్ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. కట్ చేస్తే లెజెండ్ విడుదల కావడం జగపతి బాబుకు మంచి పేరు రావడం వెంట వెంటనే జరిగిపోయిందని ఈ ఫ్యామిలీ స్టార్ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











