ఆ తృప్తిని మాటల్లో చెప్పలేం.. అది ఫీల్ అయితేనే అర్థమవుతుంది..!
Actress Indraja: సీనియర్ హీరోయిన్ ఇంద్రజ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 90వ దశకంలో ఎన్నో మంది స్టార్ హీరోల సరసన నటించింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన ఖాతాలో హిట్ సినిమాలను వేసుకుంది. ఇంద్రజ కెరీర్ లో అమ్మ దొంగ, యమలీల, హలో బ్రదర్, వజ్రం, జగదేకవీరుడు అతిలోకసుందరి, చిలక్కొట్టుడు లాంటి సూపర్ సినిమాలు నటిస్తున్నారు. హీరోయిన్‌గా సూపర్ ఫామ్‌లో ఉన్నప్పుడు మొహమ్మద్ అబ్సర్ అనే టెలివిజన్ ఆర్టిస్టును పెళ్లి చేసుకుంది. దీంతో సినిమాలకు దూరమైంది.
చాలా రోజులు తరువాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది ఇంద్రజ. పలు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో, బుల్లితెరపై రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువైంది ఇంద్రజ. ఇటీవల రజాకర్, ప్రతినిధి, మారుతీనగర్ సుబ్రహ్మణ్యం లాంటి సినిమాల్లో నటించి, మెప్పించింది. ఒకప్పుడు హీరోయిన్ గా ఎందరో మనసులని దోచుకున్న ఇంద్రజ ఇప్పుడు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కామెడీ షోలకి జడ్జ్ గా వ్యవహరిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. ఆడవాళ్లు కూడా ఇండస్ట్రీలోకి రావాలని కోరుతున్నాను.

Misses Queen of Telangana అనే కార్యక్రమంలో సీనియర్ హీరోయిన్ ఇంద్రజ మాట్లాడుతూ.. 'బ్యూటీ పేజెంట్ అంటే అదో తప్పుడు వార్త అని ఫీల్ అవుతున్నారు. కొంతమంది ఆడవాళ్లు వేదిక మీద కొచ్చి అందరి ముందు నిలబడాలా.. అందరి ముందు మన డ్రెస్ వేసుకున్న నడవాలా.. అందరి ముందు మనం చూపించుకోవాలా..' అని భయపడుతున్నారు. 'ఇంట్లో ఉన్న ప్రతి ఆడవాళ్ళకి చెప్తున్నాను. నేను అయినా.. ఇతర హీరోయిన్స్ అయినా గానీ, మీడియా ముందుకు వస్తున్న ఆడది. ఎటువంటి తప్పుడు పనులు చేయకుండా లేదా ఎటువంటి తప్పుడు దారి పట్టకుండా.. తనకున్నటు వంటి టాలెంట్ ని ప్రూఫ్ చేసుకోవడానికి మాత్రమే మీ ముందు నిలబడ్డారు' అని ఇంద్రజ పేర్కొంది.
'ఎలాంటి అపోహలకు గురికాకుండా.. మీ ఇంట్లో వాళ్ళు గాని, నీకు సంబంధించిన వాళ్ళ గాని, మీ బంధుమిత్రులు గాని అదేంటి? ఆడదేంటి? కెమెరా ముందు నిలబడడం ఏంటి? కెమెరా ముందు వెళ్లి ప్రదర్శించడం ఏంటి? ఏం చెప్పినా దయచేసి పట్టించుకోవద్దు' అని సూచించింది. 'మీ టాలెంట్ నీకు మాత్రమే తెలిసిన.. మీ టాలెంట్ మీ ఐడెంటిటీని ఎవరి కోసము మీరు పోగొట్టుకోవద్దు. మీరు రండి.. ముందుకు రండి.. మీరేంటో నిరూపించుకోండి నిజంగా చెప్తున్నాను. ఆ తర్వాత మీకున్న ఒక ఫీల్ ఉంటుంది చూడండి' అంటూ మోటివేట్ చేసింది.

'మనల్ని మనం మనలో ఉన్న టాలెంట్ చూపించినప్పుడు మనమేంటో చూపించుకున్నప్పుడు.. మీకు ఒక ఆత్మ సంతోషంగా తృప్తి చెందుతారు. చూడండి అది మాటల్లో చెప్పలేము. ఇప్పుడు నేను చెప్పిన మీకు అర్థం కాదు. మీరు అంతట మీరు ఫీల్ అయితేనే అది అర్థమవుతుంది. ముందుకు రావాలి .. మీకంటూ ఓ స్పెషల్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోండి. మేమందరం పొందిన హ్యాపీనెస్ మీరందరూ కూడా పొందాలి' అంటూ ఇంద్రజ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











