మహేష్‌కు తల్లిగా స్టార్ హీరోయిన్!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. రైతు కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ చిత్రం గురించి తాజగా మరో ఆసక్తికరమైన వార్త ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం మహేష్ బాబు తల్లిగా అలనాటి అందాల తార జయప్రద నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మహేష్ స్నేహితుడి పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్నాడు. పూజ హెగ్డే హీరోయిన్.

దిల్ రాజు, అశ్విని దత్ సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. భరత్ అనే నేను భారీ విజయం తరువాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో విపరీతంగా అంచనాలు నెలకొని ఉన్నాయి. వంశీ పైడిపల్లి కూడా ఈ చిత్రం కోసం రెండేళ్ల పాటు ఎదురుచూశాడు. 2019 వేసవిలో ఈ చిత్రం విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











