Jayaprada: పరారీలో జయప్రద... వెతుకుతున్న పోలీసులు... అసలు ఏమైందంటే?

అలనాటి హీరోయిన్ జయప్రద గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి.. స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాల్లో నటించి.. జాతీయ స్థాయిలో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జయప్రద మిస్సింగ్ అయినట్లు తెలుస్తోంది. ఆమె ఓ కేసులో నిందితురాలిగా ఉండగా... పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతటి ఫేమ్, క్రేజ్ దక్కించుకున్న ఆమె... ఎందుకు పారిపోవాల్సి వచ్చింది.. అసలు ఆ కేసు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు, మాజీ ఎంపీ జయప్రద... ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి పాపుల్ అయ్యారు. ఎన్టీఆర్, ఎన్నార్, కృష్ణ వంటి స్టార్ హీరోల సరసన నటించి... ప్రేక్షకుల కలల రాణిగా ఎదిగారు. అప్పట్లో ఆమెను వెండితెరపై చూసేందుకు... థియేటర్లకు క్యూ కట్టేవారు. ఇక సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ అందాల భామ.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

Senior Heroine Jayaprada Missing and police are searching for her Full Details Here

జయప్రద నిజానికి తెలుగు ప్రాంతానికి చెందిన వ్యక్తే. అయినప్పటికీ యూపీలో సమాజ్ వాదీ పార్టీ తరపున పోటీ చేసింది. ఉత్తర్ ప్రదేశ్ లోని రాంపూర్ నుంచి జయప్రద రెండు సార్లు ఎంపీగా గెలిచి... రాజకీయంగా ప్రజలకు సేవలు అందిస్తూ వస్తుంది. 2004 నుంచి 2014 వరకు ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా బాధ్యతలు నిర్వహించాగ.... 2019 సార్వత్రిక ఎన్నికలకి ముందు సమాజ్‌వాదీ పార్టీ నుంచి బీజేపేలో చేరి.. రాంపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయింది.

అయితే జయప్రద ఓ కేసులో నిందితురాలిగా ఉన్నారు. 2019లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన విషయంలో జయప్రదపై రెండు కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసుల విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం పలు మార్లు జయప్రదను ఆదేశించింది. అయినప్పటికీ ఆమె హాజరు కాలేదు. ఈ క్రమంలోనే నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది.

Senior Heroine Jayaprada Missing and police are searching for her Full Details Here

జనవరి 10వ తేదీన జయప్రదను తమ ముందు ప్రవేశ పెట్టాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే జయప్రద మిస్సింగ్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం పోలీస్ యంత్రాంగం ఆమెను వెతికే పనిలో పడ్డారని తెలుస్తోంది. పోలీస్ ప్రత్యేక బృందం గాలింపు చేస్తున్నప్పటికీ ఆమె ఆచూకీ లభ్యం కాలేదని తెలుస్తోంది. ఆమె ఎక్కడికి వెళ్లారు అనేది తెలియాల్సి ఉంది.

అసలు కేసు ఏంటంటే... 2019 ఏప్రిల్‌ 19న ఎన్నికల నియమావళికి విరుద్ధంగా జయప్రద యూపీలో రోడ్డును ప్రారంభించారు. ఇదే కాకుండా... బహిరంగ సభలో జయప్రద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనేది ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో ఆమెపై స్వర్, కెమ్రీ పోలీస్ స్టేషన్లలో రెండు కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఈ రెండు కేసులపై పోలీసుల విచారణ జరగ్గా... అనంతరం కోర్టులో చార్జి షీటు దాఖలు చేశారు.

అయితే ఈ కేసుల్లో గత కొన్ని రోజులుగా ఆమెకు కోర్టుకు హాజరు కావడం లేదని తెలుస్తోంది. దీంతో నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అవ్వగా... ఈ క్రమంలో జయప్రద కోసం ఢిల్లీ, ముంబైలోని పలు చోట్ల ప్రత్యేక పోలీసు బృందాలు వెతికినా ఆమె ఆచూకీ లభించడం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X