టీవీ9 అఫీస్ కు గన్నుతో వెళ్లిన మోహన్ బాబు.. వాన్ని చంపేస్తాను అంటూ..

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇటీవల ఎన్నికల సందర్భంగా మంచు వారి ఫ్యామిలీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. వారు ఇచ్చిన స్పీచ్ లు కూడా మీడియాలో వైరల్ అయ్యాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో అసలు మంచు విష్ణు ప్యానెల్ గెలుస్తుంది అని ఎవరూ ఊహించలేదు. తప్పకుండా ప్రకాష్ రాజ్ గెలుస్తాడు అని అందరు అనుకున్నారు. అయితే మోహన్ బాబు తన నిర్ణయాలతో కొడుకును ముందుండి గెలిపించాడు. అయితే మా ఎన్నికలు జరుగుతున్న సమయంలో కొన్ని గొడవలు అయిన విషయం తెలిసిందే.

మోహన్ బాబు కావాలని కొందరిపై ఆగ్రహం వ్యక్తం చేశాడని కొట్టడానికి కూడా వెళ్లినట్లు కొంతమంది సీనియర్ నటీనటులు ఆరోపించారు. అయితే మోహన్ బాబు తరచుగా కోపానికి గురవుతున్నారని అదే చాలాసార్లు ఆయనకు పై తీవ్ర ప్రభావం కూడా చూపించినట్లు ఇటీవల కొందరు వివరణ కూడా ఇచ్చారు. ఒక సీనియర్ జర్నలిస్టు కూడా మోహన్ బాబు గతంలో టీవీ9 ఆఫీస్ కు గన్నుతో వచ్చిన విషయాన్ని కూడా చెప్పాడు.

మోహన్ బాబు కోపం..

మోహన్ బాబు కోపం..

మోహన్ బాబు చాలా కోపదారి మనిషి అని ఇటీవల కొంత మంది సినీ ప్రముఖులు కూడా డైరెక్ట్ గా నే చెప్పేసారు. మా ఎన్నికల అనంతరం మంచు విష్ణు ప్రమాణస్వీకారం లో సీనియర్ రాజకీయ నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా అదే విషయాన్ని చెప్పారు. అయితే తన కోపం వల్ల తను మాత్రమే నష్టపోయారని మోహన్ బాబు కోపం వల్ల ఇతరులు ఎప్పుడు నష్టపోలేదు అని కూడా చాలా పాజిటివ్ గా వివరణ ఇచ్చారు. మోహన్ బాబు కూడా ఆ విషయాన్ని ముందుగానే ఒప్పుకున్నారు కూడా.

అందరూ భయపడ్డారు

అందరూ భయపడ్డారు

ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్ట్ జాకీర్ టీవీ9 మీడియాలో పని చేస్తున్నప్పుడు ఒకసారి మోహన్ బాబు చూపించిన కోపం గురించి చాలా క్లియర్ గా వివరణ ఇచ్చారు. జాకీర్ మాట్లాడుతూ.. ఇటీవల మా ఎన్నికల సమయంలో మోహన్ బాబు కొందరిపై దాడికి కూడా సిద్ధమయ్యారు అని తెలిసినప్పుడు చాలా మంది బయట చెప్పడానికి భయపడ్డారు. ఎందుకంటే మోహన్ బాబు చాలా సీరియస్గా హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు అని తెలియజేశారు.

టీవీ9 కు తుపాకీతో వచ్చిన మోహన్ బాబు

టీవీ9 కు తుపాకీతో వచ్చిన మోహన్ బాబు

మోహన్ బాబుకు భయపడడానికి ఒక కారణం కూడా ఉంది.. కేవలం కొడతాను అని చెప్పడమే కాదు ఆయనకు కోపం వస్తే కొట్టిన కొడతాడు. మోహన్ బాబు దాదాగిరి, రౌడీఇజం గురించి నాకు బాగా తెలుసు. ఒకసారి డైరెక్ట్ గా ఆయన మీడియా ముందుకు వచ్చి హెచ్చరికలు కూడా జారీ చేశాడు. నేను ఒకసారి టీవీ9 లో పని చేస్తున్నప్పుడు ఒక వార్త విషయంలో మోహన్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఏకంగా ఆఫీస్ కు గన్ను తీసుకొని రావడం అందరిని ఆశ్చర్యానికి కలిగించింది అని జాకీర్ తెలియజేశారు..

అలా గన్నుతో వస్తే ఏమనుకోవాలి..

అలా గన్నుతో వస్తే ఏమనుకోవాలి..

మోహన్ బాబు కుటుంబానికి సంబంధించిన ఒక వివాదంపై వార్త రావడంతో ఆయన ఒక్కసారిగా టీవీ9 పై దాడి చేసేందుకు వచ్చారు. ఏ మాత్రం ఆలోచించకుండా చేతిలో తుపాకీ పట్టుకుని రవి ప్రకాష్ ఎక్కడ అని అతని కాల్చి పారేస్తా.. అంటూ బెదిరించారు కూడా. ఒక విధంగా వార్త ఎలాంటిదైనా సరే మోహన్ బాబు ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.

లేదంటే సంస్థ అధినేత తో కూడా మాట్లాడుకుని చర్చలు జరుపుకోవచ్చు..లేదంటే కోర్టుకు వెళ్లి పరువు నష్టం దావా కూడా వేసే అవకాశం ఉంటుంది. కానీ అలా చేయకుండా మోహన్ బాబు హుటాహుటిన గన్ను పట్టుకుని కాల్చేస్తాను అంటే అతని గురించి ఏమనుకోవాలి. మోహన్ బాబు కోపం గురించి కూడా ఇటీవల మంచు విష్ణు ప్రమాణస్వీకారం సమయంలో మంత్రి తలసాని తెలియజేశారు. ఆయన కోపం తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో ఆరోజు చాలా క్లియర్ గా చూసాను అంటూ జాకీర్ తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X