తిరిగి రాని లోకాలకు బీఏ రాజు.. అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి.. హీరో శ్రీకాంత్ ఎమోషనల్
సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ పీఆర్వో, నిర్మాత బీఏ రాజు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడాన్ని సినీ పాత్రికేయులు, నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు జీర్ణించుకోలేకపోతున్నారు. షుగర్ లెవెల్స్ పడిపోవడం, గుండెపోటుకు గురై మరణించడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. శుక్రవారం సాయంత్రం ఆయన బంజారా హిల్స్‌లోని కేర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే.
బీఏ రాజు అంత్యక్రియలు శనివారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో ముగిసాయి. ఈ అంత్యక్రియలకు హీరో శ్రీకాంత్, దర్శకుడు సముద్ర, డిస్టిబ్యూటర్ కొమ్మినేని వెంకటేశ్వరరావు, నమస్తే తెలంగాణ సినిమా ఇంఛార్జ్ మధు మడూరి, పీఆర్వోలు ఏలూరి శ్రీను, దిడ్డి శ్రీను, మహేష్ బాబు వ్యక్తిగత సహాయకుడు విశ్వ, సూపర్ హిట్ మ్యాగజైన్ సిబ్బంది, కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

బీఏ రాజు పార్దీవ దేహానికి హిందూ సంప్రదాయ పద్దతుల్లో అంత్యక్రియలు నిర్వహించారు. పలువురు కడసారి ఆయనకు శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పలువురు తీవ్ర విషాదానికి గురయ్యారు.
నాలుగు దశాబ్దాలుగా జర్నలిజంలో కొనసాగుతూ.. 1000కిపైగా సినిమాలకు పీఆర్వోగా పనిచేశారు. పలు సినిమాలకు నిర్మాతగా పనిచేశారు.


Click it and Unblock the Notifications











