హీరోయిన్లకు శృంగార పూజలు.. ఓ రాత్రి అక్కడ గడిపి.. వేణు స్వామి దారుణాలు వెలుగులోకి!

మన జీవితం హాయిగా ఏ ఇబ్బందులు లేనప్పుడు భగవంతుడు నామమాత్రంగానైనా గుర్తుకురాడు. వ్యాపారంలో నష్టాలు వచ్చినప్పుడు, ఉద్యోగం ఊడిపోయినప్పుడు, నయం కాని జబ్బు వెంటాడుతున్నప్పుడు ఒక్క దేవుడేం ఖర్మ.. ముక్కోటీ దేవుళ్లు ఎక్కడున్నారా వెతుకుతూ ఉంటాడు మనిషి. మనం బాధలో ఉన్నప్పుడు చిన్న మాట కూడా గొప్ప ఓదార్పునిస్తుంది. ఆ సమయంలో వచ్చి పలకరించినవాడిని దేవుడిలా చూస్తాం. సరిగ్గా అప్పుడే మీ కష్టాలను చిటికెలో పరిష్కరించేస్తా.. పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చిస్తామంటూ కొందరు జ్యోతిష్యులు మనకు తారసపడుతుంటారు. మన బలహీనతను ఆసరాగా తీసుకుని మనల్ని మరింత ఊబిలోకి నెడుతుంటారు.

ప్రస్తుతం సెలబ్రెటీ జ్యోతిష్యుడు వేణుస్వామి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. అప్పట్లో ఈయన చెప్పిన జోస్యాలు ఒకదాని వెంట ఒకటి ఫలించడంతో సోషల్ మీడియాలో వేణుస్వామి పేరు మారుమోగింది. వరుస ఇంటర్వ్యూలు, ఛానెల్స్‌కు పిలిపించి లైవ్ డిబేట్లు.. ఇలా ఒకటేమిటీ ఆయన కరుణా కటాక్షాల కోసం సినీ, రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు క్యూకట్టేవారు. టైం ఎప్పుడూ ఒకేలా నడిస్తే ఇంకేందుకు గొప్ప జ్యోతిష్యుడినని , తన మాటకు తిరుగులేదని చెప్పుకున్న వేణుస్వామి జాతకమే రివర్స్ అయ్యింది.

senior journalist tv5 murthy sensational comments on venu Swamy s yoni puja

ఏపీ, తెలంగాణ ఎన్నికలు, ఐపీఎల్‌ సహా కీ ఈవెంట్స్ విషయంలో వేణుస్వామి ప్రిడెక్షన్స్ ఫలించకపోగా ఆయన ట్రోలింగ్ బారినపడ్డారు. ఇంతలో నాగచైతన్య - శోభితల వ్యక్తిగత జీవితాలపై కామెంట్ చేయడంతో వేణుస్వామికి ఉన్న కాస్త పరువు కూడా పోయింది. ఈ దెబ్బతో నెటిజన్లకు ఆయన మరింత టార్గెట్ అయ్యారు. ఈ వివాదం నడుస్తుండగానే.. వేణుస్వామి తన సతీమణి వీణ శ్రీవాణితో కలిసి ఓ వీడియో రిలీజ్ చేశారు. టీవీ5 ఛానెల్‌లో తన గురించి వరుసపెట్టి డిబేట్లు జరుగుతున్నాయని.. మూర్తి అనే సీనియర్ జర్నలిస్ట్ తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని, రూ.5 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని తాము అంత ఇచ్చుకోలేమని ఆత్మహత్యే శరణ్యమంటూ వాపోయాడు.

దీంతో వేణుస్వామి దంపతులు తనపై చేసిన ఆరోపణలకు కౌంటరిచ్చారు టీవీ5 మూర్తి. తాను ఏ డబ్బులు డిమాండ్ చేయలేదని, తన కాల్ డేటా- వేణుస్వామి కాల్ డేటా బయటకు తీద్దామని.. తాను తప్పు చేసినట్లు తేలితే రాళ్లతో కొట్టి చంపాలని మూర్తి సవాల్ విసిరారు. మూడు దశాబ్ధాల జర్నలిజం కెరీర్‌లో జీతభత్యాలు కాకుండా మూడో వ్యక్తి నుంచి నయా పైసా తీసుకోలేదని మూర్తి స్పష్టం చేశారు. ఇదే సమయంలో వేణుస్వామి గతంలో మాట్లాడిన మాటలను టీవీ5 మూర్తి బయటపెట్టారు.

ముఖ్యంగా యోని పూజల గురించి వేణుస్వామి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఓ వీడియోలో సంతాన భాగ్యం లేని జంట కామాఖ్య వెళ్లి, ఓ రాత్రి భార్యాభర్తలిద్దరూ కాపురం చేస్తే ఖచ్చితంగా అమ్మవారు కరుణిస్తారని వేణుస్వామి చెప్పారు. అయితే ఇవన్నీ వామాచారం కిందకు వస్తాయని, ఎక్కడో కామాఖ్య ఆలయంలో ఆచరించే పూజలను వేణుస్వామి దక్షిణ భారతదేశంలో తీసుకొస్తున్నారని మూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో కంచి, పిఠాపురం తదితర ఆలయాల్లో ఉన్న ఈ తరహా పూజా విధానాలను, ఉగ్రంగా ఉన్న అమ్మవార్లను ఆదిశంకరులు శాంతంగా మార్చారని మూర్తి గుర్తుచేశారు. తన వద్దకు వచ్చే హీరోయిన్లు , సామాన్యులను ఇలాంటి పూజల పేర్లు చెప్పి కోట్లాది రూపాయాలు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మరి టీవీ5 మూర్తి ఆరోపణలపై వేణుస్వామి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More from Filmibeat

Read more about: venu swamy tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X