twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డ్రగ్స్ కేసు: నిజమైతే రకుల్ పరిస్థితేంటి.. సంచలన విషయాలు బయటపెట్టిన న్యాయవాది

    |

    బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు వ్యవహారం మొదలైనప్పుటి నుంచి కూడా సెలబ్రెటీల గుండెల్లో ఒక దడ మొదలైనట్లు అర్ధమవుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా NCB అధికారులు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ విచారణకు హాజరు కావాలని చెబుతున్నారు. ఇక ఇటీవల బాలీవుడ్ స్టార్స్ తో పాటు రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఆ కేసులోఇరుక్కోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన రకుల్ కి రానున్న రోజుల్లో కోర్టు మెట్లు ఎక్కే అవకాశం ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

    ఆమెతో స్నేహం చేయడమే కొంప ముంచిందా?

    ఆమెతో స్నేహం చేయడమే కొంప ముంచిందా?

    డ్రగ్స్ తీసుకోకపోయినా కూడా రియా చక్రవర్తితో స్నేహం చేయడమే రకుల్ ని ఇబ్బందుల్లో పడేసినట్లు క్లియర్ గా అర్ధమవుతోంది. విచారణలో ఈ టాలీవుడ్ బ్యూటీ అధికారులు అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సూటిగానే సమాధానం చెప్పిందట. డ్రగ్స్ తానెప్పుడు కూడా తీసుకోలేదని కానీ వాట్సాప్ లో చాటింగ్ చేసిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నట్లు నేషనల్ మీడియా ఛానెల్స్ లో కథనాలు వెలువడుతున్నాయి.

     రియా చెబితేనే అలా చేసిందట

    రియా చెబితేనే అలా చేసిందట

    ముఖ్యంగా రకుల్ కి రియా చక్రవర్తి డ్రగ్స్ ఇచ్చిందని వాటిని ఆమె తన ఇంట్లోనే దాచిపెట్టిందని ఇండియాటుడే, రిపబ్లిక్ టీవీల్లో కథనాలు వెలువడ్డాయి. అయితే అలాంటి ఆరోపణలు వస్తున్న తరుణంలో రకుల్ తన వివరణ ఇచ్చింది. ఆ డ్రగ్స్ తో తనకు ఏ మాత్రం సంబంధం లేదని రియా దాచిపెట్టమంటేనే వాటిని దాచి ఉంచానని కూడా ఆమె అధికారులకు తెలిపినట్లు సదరు మీడియా పేర్కొంది.

    అదే నిజమైతే రకుల్ పరిస్థితేంటి?

    అదే నిజమైతే రకుల్ పరిస్థితేంటి?

    ఇక రకుల్ ని విచారణ చేసిన అనంతరం ప్రముఖ న్యాయవాది చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. పింక్ విల్లా అనే వెబ్ సైట్ కు ఇచ్చిన వివరణలో న్యాయవాది రిజ్వాన్ మర్చంట్ సంచలన విషయాలను బయటపెట్టారు. ఒకవేళ రకుల్ స్టేట్మెంట్ గనక నిజమైతే.. ఎన్డీపీఎస్ చట్టం 8(సి) ప్రకారం డ్రగ్స్ ను దాచడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఇక ఆమెను అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఒక విధంగా డ్రగ్స్ సేవించడం కంటే కూడా వాటిని దాచడమే పెద్ద శిక్షకు దారి తీసే అవకాశం ఉంటుంది.

    Recommended Video

    Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
    బెయిల్ కూడా దొరకదా?

    బెయిల్ కూడా దొరకదా?

    ఇక బెయిల్ విషయం గురించి మాట్లాడితే.. డ్రగ్స్ ఏ స్థాయిలో దాచారు అనే దానిపైనే ఉంటుంది. కొన్నిసార్లు బెయిల్ కూడా దొరక్కపోవచ్చు. సెక్షన్ 27 కింద డ్రగ్స్ తో సంబంధాలు ఉన్నాయని ఏ మాత్రం ఋజువైనా కూడా అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది.. అని లాయర్ రిజ్వాన్ చెప్పినట్లు పింక్ విల్లా పేర్కొంది. మొత్తంగా బాలీవుడ్ లో రియా చక్రవర్తితో స్నేహం చేయడమే రకుల్ ప్రీత్ సింగ్ ని తీవ్ర స్థాయిలో ఇబ్బందుల్లోకి నెత్తినట్లు తెలుస్తోంది.

    English summary
    Bollywood Actress Rhea Chakraborty reportedly revealed that she used to consume drugs with Sara Ali Khan, Rakul Preet Singh, Simone Khambatta. As per Times Now report,Rhea has named Sara Ali Khan, Simone Khambatta, Rakul Preet Singh for buying and taking drugs. Rakul Preet Singh confessed Chats with Rhea Chakraborty a
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X