ఇండస్ట్రీలో మరో విషాదం.. సీనియర్ మేకప్ మెన్ గంగాధర్ మృతి
కరోనా సెకండ్ వేవ్ లో విలయతాండవం చేస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా రోజుకు నాలుగు వేలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో కూడా నిత్యం ఏదో ఒక చెడు వార్త అందరిని కలచి వేస్తోంది. ఇక ఎన్నో సినిమాలకు మేకప్ మెన్ గా వర్క్ చేసిన మేకప్ మెన్ గంగాధర్ కూడా కరోనా కారణంగా తుది శ్వాస విడిచారు.
గంగాధర్ మృతి పట్ల ఇండస్ట్రీ ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. దాదాపు పాతికేళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉంటున్న గంగాధర్ ఎన్నో విభిన్నమైన సినిమాలకు వర్క్ చేశారు. లక్కీ మీడియా నిర్మాణ సంస్థ అధినేత, ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ గంగాధర్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మా లక్కీ మీడియా నిర్మాణ సంస్థలో గంగాధర్ చీఫ్ మేకప్ మెన్‌గా పని చేశారని, 'టాటా బిర్లా మధ్యలో లైలా' సినిమా నుంచి కూడా గంగాధర్ ఒక ఫ్యామిలీ పర్సన్ లా తనతో ట్రావెల్ అవుతూ వచ్చాడని అన్నారు.

ప్రొడ్యూసర్ యలమంచి రవిచంద్ దగ్గరుండి గంగాధర్ అంతిమ కార్యక్రమాలను జరిపించారు. ఇక గంగాధర్ ఉత్తమ మేకప్‌మెన్‌గా కూడా నంది అవార్డు అందుకున్నారు. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడతో పాటు బాలీవుడ్ లోను వర్క్ చేశారు. ఎంతో మంది స్టార్ హీరో, హీరోయిన్లకు కూడా మేకప్ మెన్‌గా వర్క్ చేసిన గంగాధర్ హీరో శివాజీకి పర్సనల్ మేకప్ మెన్‌గా కూడా కొన్నాళ్ళు ఉన్నారు.

గంగాధర్ మరణ వార్తపై శివాజీ కూడా ఎమోషనల్ అయ్యారు. ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శ్రీ విష్ణు, విశ్వక్ సేన్ వంటి హీరోలతో పాటు మరికొందరు సినీ ప్రముఖులు గంగాధర్ మరణంపై సంతాపం ప్రకటించారు.


Click it and Unblock the Notifications











