Ntr Daughter Umamaheswari మొదటి భర్తతో నరకయాతన.. అలా గుండెల్లోనే బాధను దాచుకుని..
నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొనడంతో ఒక్కసారిగా అభిమానులు కూడా షాక్ కు గురయ్యారు. ఒకవైపు కళ్యాణ్ రామ్ బింబిసార సినిమా ప్రీ రిలీజ్ లో పనుల్లో బిజీగా ఉండగా హఠాత్తుగా వారి మేనత్త మరణ వార్త తెలియడంతో ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. సీనియర్ ఎన్టీఆర్ చిన్న కుమార్తె గారాల కూతురు ఉమామహేశ్వరి హఠాత్తుగా మరణించడంతో ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక ఉమామహేశ్వరి మరణ వార్తతో ఆమెకు సంబంధించిన ఎన్నో వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే ఒకప్పుడు ఉమామహేశ్వరి తన జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు ఎదుర్కొంది. ఆ వివరాల్లోకి వెళితే.

ఎన్టీఆర్ ఫ్యామిలీ
సీనియర్ ఎన్టీఆర్ కు మొత్తం ఎనిమిది మంది కుమారులు కాగా నలుగురు కుమార్తెలు. అయితే కుమారులలో పెద్ద కుమారుడు రామకృష్ణ చిన్నతనంలోనే మరణించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక తర్వాత ఏడుగురు కొడుకులు నలుగురు కూతుర్లతో నందమూరి ఫ్యామిలీ అప్పట్లో చాలా నిండుగా కనిపించేది. కుటుంబమే ఆస్తి అన్నట్లుగా ఎన్టీఆర్ ఎంతో అపురూపంగా వారి పిల్లలను చూసుకునేవారు. అంతేకాకుండా కొడుకు కుమార్తెలను ఎంతో క్రమశిక్షణతో పెంచేవారు.

నలుగురు కూతుళ్లు
అయితే ఎన్టీఆర్ కు నలుగురు కుమార్తెలలో పెద్ద కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి రాజకీయాల్లో కూడా బిజీగా కనిపించే వారే. ఇక నారా భువనేశ్వరి నారా చంద్రబాబు నాయుడు సతీమణిగా మీడియాలో కనిపిస్తూనే ఉంటారు. ఇక మూడో కుమార్తె గరపాటి లోకేశ్వరి కూడా అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు. కానీ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి మాత్రం పెద్దగా వార్తల్లో కనిపించేవారు కాదు.

నాలుగో కుమార్తె
సీనియర్ ఎన్టీఆర్ తన కుమార్తెలందరినీ కూడా మంచి ఉన్నతమైన కుటుంబంలో ఇవ్వాలని ఆలోచించారు. అందుకే ప్రముఖ రాజకీయ నాయకులకు పారిశ్రామికవేత్తలకు వారి కుమార్తెలను ఇచ్చి పెళ్లి చేశారు. ఇక నాలుగో కుమార్తె ఉమామహేశ్వరి కోసం కూడా అదే తరహాలో ఆలోచించి ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు కుమారుడనిచ్చి పెళ్లి చేశారు. కానీ అతను ఏమాత్రం కనికరం లేకుండా ఉమామహేశ్వరుని బాధ పెడుతూ ఉండేవాడు. కొన్ని రోజులకే నరకయాపన చూపించడంతో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారట.

నరకయాతన
మాజీ కేంద్రమంత్రి చిదంబరం బంధువుల్లో ఒకరైన నరేన్ రాజన్ కు ఉమామహేశ్వరినిఇచ్చి పెళ్లి చేశారు. కానీ అతను పెళ్లి తర్వాత పెద్ద శాడిస్ట్ అని అందరికీ తెలిసింది. అప్పటికే ఎన్టీఆర్ కు దక్షిణాది రాష్ట్రాల్లో మంచి పేరు ఏర్పడింది. కానీ అతను మాత్రం అవేమీ పట్టించుకోకుండా కనీసం ఎన్టీఆర్ మీద గౌరవం కూడా లేకుండా ఆమెకు నరకాన్ని చూపించాడు. సిగరెట్లతో ఆమెను కాల్చి మరి ఇబ్బంది పెట్టేవాడు అని అప్పట్లో ఎన్టీఆర్ కు దగ్గరే ఉండేవారు మీడియాలో కూడా చెప్పారు.

మరో పెళ్లి
నరేన్ అంతా బాధపెడుతున్నా కూడా కొన్నాళ్ల పాటు తండ్రి మీద గౌరవంతో ఆమె ఆ బాధను తన గుండెల్లో దాచుకుందట. ఇక పరిస్థితి మరింత సీరియస్ గా మారడంతో నరేన్ గురించి ఎన్టీఆర్ కు పూర్తిగా తెలిసింది. ఆ తర్వాత లాభం లేదు అని ఎన్టీఆర్ కూడా అతనితో విడాకులు ఇప్పించి మరొక ఎన్నారై తో పెళ్లి చేశారు.

కూతురి పరిస్థితి చూసి..
భర్త తరువాతే తండ్రి అయినా దైవమైనా అని కూతుళ్లకు ఎంతో బోధన చేసే ఎన్టీఆర్ కూతురు పరిస్థితి చూసి అతని నుంచి విడిపోవాల్సిందిగా చెప్పారు అంటే.. నరేన్ ఎంత నరకం చూపించి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఇక రెండవ పెళ్లి అనంతరం అమెరికాకు వెళ్లిపోయిన చిన్న కుమార్తె ఉమామహేశ్వరి ఇద్దరి పిల్లలకు జన్మనిచ్చారు. గత కొంతకాలం మళ్లీ హైదరాబాద్ కు వచ్చిన ఆమె ఇద్దరు కూతుర్ల పెళ్లిళ్లు కూడా ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే హఠాత్తుగా ఆమె ప్రాణాలు కోల్పోవడం అందరినీ తీవ్ర మనోవేదనకు గురి చేసింది.


Click it and Unblock the Notifications











