సినీ పరిశ్రమలో మరో ట్రాజెడీ.. నిర్మాత CN రావ్ కన్నుమూత
సినీ పరిశ్రమలో మహమ్మారి మరోసారి విషమంగా మారింది. కరోనా కారణంగా ఇప్పటికే కొంతమంది నటీనటులు ప్రాణాలు కోల్పోయారు. ఇక మరికొందరు తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులకు గురయ్యారు. సెకండ్ వేవ్ లో అయితే ఆ డోస్ మరింత ఎక్కువవుతోంది. ఇక తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కోవిడ్ వల్ల మరొక మంచి నిర్మాతని కోల్పోయింది.
తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సంయుక్త కార్యదర్శి అలాగే తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కార్యవర్గ సభ్యుడు CN రావ్ (చిట్టి నాగేశ్వరరావు )గారు కోవిడ్ కారణంగా తుది శ్వాస విడిచారు. నిర్మాతగానే కాకుండా పంపిణి దారుడిగా "మా సిరిమల్లే, అమ్మ నాన్న లేకుంటే, బ్రహ్మానందం డ్రామా కంపెనీ, తమిళ్ లో ఊరగా" అనే సినిమాలు నిర్మించారు. తెలుగు చలన చిత్ర నిర్మాతలు సెక్టార్ కి సెక్రెటరీగా కూడా సీఎన్ రావ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఎక్స్ ఫిల్మ్ ఫెడరేషన్ అఫ్ ఇండియా ఇక్క్యూటివ్ కమిటీ మెంబెర్ గా కూడా కొనసాగారు. నాగేశ్వరరావు గారి మరణంతో చిత్ర నిర్మాతల మండలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
నిర్మాతలు అలాగే దర్శకులు అగ్ర నటీనటులు చిట్టి నాగేశ్వరరావు మృతి పట్ల సంతాపం తెలియజేశారు. ఇక ఇప్పటికే తెలంగాణలో థియేటర్స్ బంద్ కు పిలుపునిచ్చారు. ఇక షూటింగ్స్ లలో 50మంది కంటే ఎక్కువమంది యూనిట్ సభ్యులు పాల్గొనవద్దని ఆదేశించారు.


Click it and Unblock the Notifications











