Sarath Babu: మరింత విషమంగా మారుతున్న శరత్ బాబు ఆరోగ్యం.. డాక్టర్స్ ఏమన్నారంటే?

సౌత్ సినిమా ఇండస్ట్రీలో మంచి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న శరత్ బాబు ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శరత్ బాబు ఒక ఇన్ఫెక్షన్ తో కూడా ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే స్కిన్ కు సంబంధించిన ఇన్ఫెక్షన్ రావడంతో ఇప్పుడు పరిస్థితి కొంత సీరియస్ గా మారినట్లుగా తెలుస్తోంది.

ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితిపై సమీక్షించిన వైద్యులు అత్యవసర చికిత్స చేయడం జరిగింది. అయితే మళ్లీ ఇటీవల ఆయన ఆరోగ్యం కొంత క్షీణించడంతో కుటుంబ సభ్యులు వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఇక శరత్ బాబు మెల్లగా కోరుకుంటున్నారు అనే సమయంలోనే ఇన్ఫెక్షన్ శరీరం మొత్తం వ్యాపించినట్లుగా వైద్యులు తెలిపారు. అయితే ఆ ప్రభావం ఇతర అవయవాలపై కూడా తీవ్ర ప్రభావం చూపించవచ్చు అని అంటున్నారు.

sarathbabu

ప్రస్తుతం శరత్ బాబుకు ఐసీయూలో వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. 70 ఏళ్ల వయసులో ఉన్న శరత్ బాబు చాలా కాలంగా స్కిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. గతంలోనే ఆయన చెన్నైలోనే ఒక ప్రముఖ హాస్పిటల్ లో చాలా కాలం పాటు చికిత్స అందుకున్నారు అయితే ఇటీవల ఆయన మరోసారి తీవ్రస్థాయిలో అస్వస్థతకు గురి కావడంతో బెంగళూరులో జాయిన్ చేశారు.

ఇక అక్కడి నుంచి మళ్లీ హైదరాబాదులోని ఏఐజీ హాస్పిటల్కు తరలించాల్సి వచ్చింది. ఇప్పుడు శరత్ బాబు వైద్యుల పర్యవేక్షణ లోనే వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నారు. ఆయన కోలుకోవాలని ప్రముఖులు శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు. ఇక శరత్ బాబు శరీరంలోని ఊపిరితిత్తులు అలాగే కిడ్నీలపై కూడా ఇన్ఫెక్షన్ తీర స్థాయిలో ప్రభావం చూపించినట్లుగా వైద్యులు తెలిపారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్న వైద్యులు కొన్ని గంటలు గడిస్తే గాని ఆయన ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీగా వివరణ ఇవ్వలేము అని వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X