Sarath Babu ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన సోదరి.. ఫేక్ న్యూస్ నమ్మకండి అంటూ వివరణ..

ఎన్నో విభిన్నమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సీనియర్ నటుడు శరత్ బాబు గతకొంత కాలంగా అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్ జాయిన్ అయ్యారు. ప్రస్తుతం వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన హఠాత్తుగా మరణించారు అంటూ సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు రావడంతో సినిమా ఇండస్ట్రీని ఒక్కసారిగా కలచివేసింది.

ఇక ఆ విషయంలో వెంటనే శరత్ బాబు సోదరి క్లారిటీ ఇచ్చారు. అందులో ఎలాంటి నిజం లేదని సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మకండి అంటూ కుటుంబ సభ్యుల ద్వారా వివరణ ఇచ్చారు. శరత్ బాబు ఇప్పుడిప్పుడే మెల్లగా కోలుకుంటున్నారు. ఆయనను మరొక రూమ్ కు షిఫ్ట్ చేయడం జరిగింది అంతే.. త్వరలోనే శరత్ బాబు గారు కొలుకొని మీడియాతో మాట్లాడతారు అనే నమ్మకం మాకు ఉంది. దయచేసి తప్పుడు వార్తలు ఎవరు ప్రచారం చేయకండి అంటూ శరత్ బాబు సోదరి తెలియజేశారు.

Senior south actor sarath babu latest health update

ఇక ఇండస్ట్రీలో పాజిటివ్ నెగిటివ్ రోల్స్ అని తేడా లేకుండా తనదైన శైలిలో నటిస్తూ వచ్చిన శోభన్ బాబు సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. ఎంతో నవ్వుతూ ఆప్యాయంగా పలకరించే శరత్ బాబు ఇప్పుడు హఠాత్తుగా కన్నుమూశారు అని వార్తలు వచ్చేసరికి చిత్ర పరిశ్రమతో పాటు ఆయన సన్నిహితులు అభిమానులు కూడా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇక శరత్ బాబు సోదరి ఇచ్చిన వివరణతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

నటుడిగా నే కాకుండా మంచి మనిషిగా కూడా గుర్తింపు అందుకున్న శరత్ బాబు గత కొంతకాలంగా వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. 70 ఏళ్ల వయసులో శరత్ బాబు స్కిన్ ఇన్ఫెక్షన్ వ్యాధితో బాధపడుతున్నట్లుగా ఆయన సన్నిహితులు తెలియజేశారు. గత 15 ఏళ్ల క్రితమే ఆయన ప్రత్యేకంగా ట్రీట్మెంట్ కూడా తీసుకున్నప్పటికీ ఇన్ఫెక్షన్ ఏమాత్రం తగ్గలేదు. మళ్లీ మూడు నెలల క్రితం ఆయన ఆరోగ్యం మరింత విషమంగా మారుతుందని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో జాయిన్ చేశారు.

మొదట క్చెన్నైలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందుకున్న శరత్ బాబు ఆ తర్వాత వెంటనే హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏఐజి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఇక ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చాలా వరకు శరత్ బాబు ఐసీయూలోనే వెంటిలేటర్ పైన ఉండాల్సి వచ్చింది. ఇన్ఫెక్షన్ ప్రభావం వలన శరత్ బాబు ఊపిరితిత్తులు అలాగే కిడ్నీలు చాలా వరకు దెబ్బతిన్నాయి. ఆ ప్రభావం వలన ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. ఇక ఇటీవల పరిస్థితి మరింత విషమంగా మారడంతో వైద్యులు ఆయనను మళ్ళీ మాములు స్థితిలోకి తీసుకు రావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X