చాలా కాలం తరువాత సీనియర్ హీరో తరుణ్ రీ ఎంట్రీ.. స్నేహితుడితో కలిసి బిగ్ ప్లాన్!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ అందుకున్న హీరోల్లో తరుణ్ ఒకరు. పసి వయసులోనే బాల నటుడిగా వెండితెరపై మెరిసిన తరుణ్ టీనేజ్ వయసు దాటగానే హీరోగా ఎంట్రీ ఇచ్చి అప్పట్లో ఒక మంచి డిమాండ్ ఉన్న స్టార్ గా క్రేజ్ అందుకున్నాడు. అయితే కొన్నాళ్ల అనంతరం అపజయాల కారణంగా స్లో అయిన తరుణ్ ఇప్పుడు సరికొత్తగా రెడీ అవుతున్నాడు.

బాలా నటుడిగా
పదేళ్ల వయసులోనే వెండితెరపై కనిపించిన తరుణ్ తమిళ్ తెలుగు మలయాళం అని తేడా లేకుండా బాల నటుడిగా అన్ని భాషల్లో కనిపించాడు. సూర్య ఐపీఎస్, ఆదిత్య 369లో ఏ స్థాయిలో మెప్పించాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. క్రికెటర్ గా కూడా కొన్నాళ్ళు కెరీర్ ను కొనసాగించాడు.

ఆ సినిమాతో ట్రెండ్ సెట్టర్
2000వ సంవత్సరంలో వచ్చిన నువ్వే కావాలి సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. ఇండస్ట్రీలో అత్యదిక ప్రాఫిట్స్ అందించిన సినిమాల్లో అప్పట్లో ఆ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ అందుకుంది. అయితే ఆ సినిమా తరువాత నువ్వే నువ్వే వంటి సినిమాతో కూడా మంచి హిట్ అందుకున్నాడు.

మళ్ళీ ఫామ్ లోకి రావాలని
తరుణ్ కెరీర్ లో ఎక్కువగా లవ్ స్టోరీలతోనే వచ్చాడు. అదే అతని కెరీర్ పై కొంచెం ఎఫెక్ట్ చూపించింది. ఫెయిల్యూర్స్ తో సంభంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వచ్చిన తరుణ్ ఎలాగైనా మళ్ళీ ఫామ్ లోకి రావాలని అనుకుంటున్నాడు. అందుకే కొత్త తరహా కంటెంట్ లను సెట్ చేసుకుంటున్నాడు.

స్నేహితుడు రాసిన కథ
తరుణ్ చివరగా 2017లో ఇది నా లవ్ స్టోరీ అనే సినిమా చేశాడు. ఆ సినిమా తరువాత కొన్ని కథలపై చర్చలు జరిపినప్పటికి వర్కౌట్ కాలేదు. ఇక నాలుగేళ్ళ అనంతరం తన ఫ్రెండ్ తోనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. స్నేహితుడు రాసిన కథ తరుణ్ కు బాగా నచ్చిందట. నేటి ట్రెండ్ కు తగ్గట్లుగా ఆ సినిమా రానున్నట్లు తెలుస్తోంది. తరుణ్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











