శ్రీ రెడ్డి కథ క్లైమాక్స్‌.. సంచలన తార ఖతర్నాక్ రియాక్షన్

సంచలనాలకు మారు పేరైన శ్రీ రెడ్డి క్లైమాక్స్‌లో చేరింది. ఇన్నాళ్లు టాలీవుడ్, కోలీవుడ్ సెలెబ్రిటీలపై విరుచుకు పడుతూ బూతు కామెంట్లు పెట్టిన ఆమె.. ఏకంగా వెండితెరపై తన ప్రతాపం చూపించేందుకు రెడీ అవుతోంది. తన రియల్ లైఫ్ క్యారెక్టర్‌కి వెండితెర రూపమివ్వబబోతోంది. ఈ మేరకు క్లైమాక్స్ అనే సినిమా సెట్స్‌పై చేరింది శ్రీ రెడ్డి. ఆ సినిమా వివరాలు చూద్దామా..

ఏ విష‌యాన్నైనా ధైర్యంగా ప్ర‌శ్నించే శ్రీ రెడ్డి..

ఏ విష‌యాన్నైనా ధైర్యంగా ప్ర‌శ్నించే శ్రీ రెడ్డి..

`డ్రీమ్‌` చిత్రంతో ఏడు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులు ద‌క్కించుకున్న భ‌వానీ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తాజాగా రూపొందుతోన్న కొత్త చిత్రం `క్లైమాక్స్`.
ఈ చిత్రంలో శ్రీ రెడ్డి నటిస్తోంది. ఏ విష‌యాన్నైనా ధైర్యంగా ప్ర‌శ్నించే శ్రీరెడ్డి ఇందులో నిజ జీవిత క్యారెక్ట‌ర్‌ పోషిస్తోంది. కైపాస్ ఫిల్మ్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ ప‌తాకంపై పి.రాజేశ్వ‌ర్ రెడ్డి, కె.క‌రుణాక‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు .

పృథ్వీరాజ్‌, శివ‌శంక‌ర్ సహా రాజేంద్ర‌ప్ర‌సాద్‌ కూడా

పృథ్వీరాజ్‌, శివ‌శంక‌ర్ సహా రాజేంద్ర‌ప్ర‌సాద్‌ కూడా

క్రైమ్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో డా.రాజేంద్ర‌ప్ర‌సాద్‌, పృథ్వీరాజ్‌, శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సాషా సింగ్‌, ర‌మేష్‌, చందు పాత్ర‌లు ప్ర‌ధానంగా ఉంటాయి. ఇందులో శ్రీ రెడ్డి పాత్రను హైలైట్ చేస్తూ పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

ఓ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ.. పొలిటిక‌ల్ సెటైర్

ఓ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ.. పొలిటిక‌ల్ సెటైర్

ఇక ఈ సినిమా గురించి డైరెక్టర్ భవాని శంకర్ స్పందిస్తూ ``ఓ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీని పొలిటిక‌ల్ సెటైర్ నేప‌థ్యంలో అల్లుకున్నాం. మేం తీసుకున్న క‌థాంశం చాలా వైవిధ్యంగా ఉంటుంది. దానికి త‌గ్గ‌ట్టు చిత్రీక‌రించిన తీరు కూడా స‌రికొత్త‌గా అనిపిస్తుంది. సినిమాలో పాత్రలు త‌క్కువే అయినప్పటికీ.. ప్ర‌తీ పాత్రా హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తుంది. ప్ర‌తి కేర‌క్ట‌ర్‌నూ ప‌టిష్టంగా తీర్చిదిద్దాం. మ‌న‌సులోని భావాల్ని నిర్భ‌యంగా వ్య‌క్తం చేస్తూ, ఎదుటివారి స్థాయికి వెర‌వ‌కుండా, న‌మ్మిన సిద్ధాంతాల కోసం నిలుచునే వివాదాస్ప‌ద న‌టిగా శ్రీరెడ్డి క‌నిపిస్తుంది. ఆమె రియ‌ల్ లైఫ్ క్యారెక్ట‌ర్‌కి ద‌గ్గ‌ర‌గా ఉండే పాత్ర అది'' అన్నాడు.

వివాదాస్పద న‌టిగా కనిపిస్తా.. శ్రీ రెడ్డి రియాక్షన్

వివాదాస్పద న‌టిగా కనిపిస్తా.. శ్రీ రెడ్డి రియాక్షన్

శ్రీరెడ్డి మాట్లాడుతూ ``వివాదాస్పద న‌టిగా ఈ చిత్రంలో న‌టించాను. క్రైమ్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో సాగే సినిమా ఇది. నా క్యారెక్ట‌ర్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. నా క్యారెక్ట‌ర్ చుట్టూనే తిరిగే ఈ క‌థ చాలా మ‌లుపులు తీసుకుంటుంది. నేను ప‌లికే ప్ర‌తి డైలాగూ, నేను క‌నిపించే ప్ర‌తి సీనూ చాలా చాలా బాగుంటాయి. ఇంత మంచి క్యారెక్ట‌ర్ కోసం న‌న్ను అప్రోచ్ అయిన భ‌వానీ శంక‌ర్‌గారికి, టీమ్‌కి థాంక్స్`` అని చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X