RRR: వైరల్ అవుతున్న రాజమౌళి, టీమ్ బల్గేరియా సెల్పీ
రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి తర్వాత తెరకెక్కుతున్న మరో భారీ ప్రాజెక్ట్ 'RRR'. రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్‌గా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం బల్గేరియాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మీద కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
'RRR' మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్న సెంథిల్ కుమార్ తన సోషల్ మీడియా పేజీ ద్వారా ద్వారా ఓ ఫోటో షేర్ చేశారు. బల్గేరియాలోని చారిత్రక పట్టణం కోపరివేష్ఠిత్సకు చిత్ర బృందం చేరుకుంది. సుందరమైన పర్వతాలు, ఆర్కిటెక్చరల్ కట్టడాలకు ఇది ప్రసిద్ది.
సెంథిల్ కుమార్ షేర్ చేసిన సెల్ఫీ పిక్‌లో రాజమౌళి, విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ శ్రీనివాస మోహన్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, మరొకొందరు చిత్ర బృందం ఉన్నారు. కోపరివేష్ఠిత్స పట్టణంలో RRR మూవీకి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.
RRR చిత్ర 1920 కాలం నాటి కథతో కొమురం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రల ఆధారంగా కల్పిత కథతో తెరకెక్కిస్తున్నారు. అల్లూరి సీతా రామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నారు.

సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్ 22న కొమురంభీం జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ లుక్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. డివివి దానయ్య ఈ భారీ చిత్రాన్ని దాదాపు రూ. 350 కోట్ల నుంచి రూ. 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











