సెప్టెంబర్ లో రాబోతున్నా 17 తెలుగు సినిమాలు.. బిగ్గెస్ట్ బాక్సాఫీస్ ఫైట్
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా కాలం తర్వాత వరుసగా కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటున్నాయి. ఆగస్టులో ఒకేసారి వచ్చిన బాంబిసార, సీతారామం మంచి కలెక్షన్స్ అందుకోగా.. ఆ తరువాత కార్తికేయ కూడా పాన్ ఇండియా రేంజ్ సక్సెస్ అందుకుంది. ఇక కంటెంట్ బాగుంటే జనాలు థియేటర్లోకి తరలి వస్తారు అని ఇటీవల కొన్ని సినిమాలు నిరూపించాయి. ఇక సెప్టెంబర్ నెలలో అయితే చాలా సినిమాలు రాబోతున్నాయి. మొత్తంగా 17 సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీకి రెడీ అయ్యాయి. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే..

సెప్టెంబర్ 1న
ముందుగా సెప్టెంబర్ 1 వ తేదీన వరుసగా మూడు సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో వైష్ణవ్ తేజ్ - కేతిక శర్మ జంటగా నటించిన రంగ రంగ వైభవంగా రొమాంటిక్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక జాతి రత్నాలు అసిస్టెంట్ డైరెక్టర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాపై కూడా కొన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడ్డాయి. ఇక వీటితోపాటు ఆకాశ వీధుల్లో.. అనే మరో చిన్న సినిమా రాబోతోంది.

మళ్ళీ వారం తరువాత
ఇక మళ్ళీ ఒక వారం తర్వాత అంటే సెప్టెంబర్ 9వ తేదీన మరికొన్ని ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. రణ్ బీర్ కపూర్ నటించిన పాన్ ఇండియా మూవీ బ్రహ్మాస్త్రతో పాటు శర్వానంద్ టైం ట్రావెల్ మూవీ 'ఒకే ఒక జీవితం' భారీ స్థాయిలో పోటీ పడబోతున్నాయి. అలాగే యువ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం 'నేను మీకు కావలసిన వాడిని' సినిమా కూడా అదే రోజు రాబోతోంది. అలాగే 'కొత్త కొత్తగా' అనే మరో చిన్న సినిమా కూడా అదే రోజు అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది

ఒకరోజు గ్యాప్ లో
ఇక సెప్టెంబర్ 15వ తేదీన బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ అయితేలేదు. ఆరోజు కేవలం విశాల్ నటించిన లాఠీ సినిమా మాత్రమే రాబోతోంది. కానీ 16వ తేదీన మాత్రం మరిన్ని చిన్న సినిమాలు రాబోతున్నాయి. సుధీర్ బాబు, కృతి శెట్టి నటించిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాతోపాటు.. 'క్రేజీ ఫెలో' అనే మరో సినిమా రాబోతోంది

మరో నాలుగు
ఇక సెప్టెంబర్ 23వ తేదీన మరో నాలుగు సినిమాల రాబోతున్నాయి. నాగ శౌర్య రొమాంటిక్ కామెడీ మూవీ 'కృష్ణ వృంద విహరి' సినిమాతో పాటు తమన్న 'గుర్తుందా సీతాకాలం' అనే మరో రొమాంటిక్ సినిమా రాబోతోంది. ఇక వీటి మధ్యలో 'అల్లూరి', 'దొంగలున్నారు జాగ్రత్త' అనే మరికొన్ని డిఫరెంట్ సినిమాలు కూడా వాటి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి.

అసలైన సినిమాలు
ఇక సెప్టెంబర్ నెల చివరలో రెండు అతి ముఖ్యమైన సినిమాలు రాబోతున్నాయి. రవితేజ నటించిన రావణాసుర సినిమా సెప్టెంబర్ 30వ తేదీన భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఇక మణిరత్నం భారీ క్యాస్ట్ తో తెరపైకి తీసుకు వస్తున్న పొన్నియిన్ సెల్వన్ సినిమా అదేరోజు రాబోతోంది. ఈ రెండు సినిమాల మధ్య కొంత బాక్సాఫీస్ పోటీ ఉన్నప్పటికీ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం రెండు సినిమాలకు మంచి కలెక్షన్స్ అయితే వస్తాయి. మరి సెప్టెంబర్ లో ఏ సినిమా అత్యధిక ప్రాఫిట్ అందిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











