NTR30: ఎన్టీఆర్ మూవీలో సీరియల్ హీరోయిన్.. ఏకంగా అతడి భార్యగా చేస్తుందిగా!
టాలీవుడ్‌లో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. కానీ, అందులో యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, సాంగ్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ సత్తా చాటుతూ ప్రత్యేకమైన ముద్రతో దూసుకుపోతోన్నాడు నందమూరి చిన్నోడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న అతడు.. RRR మూవీతో తన రేంజ్‌ను అంతర్జాతీయ స్థాయికి పెంచుకున్నాడు. అప్పటి నుంచి మరింత జోష్‌తో ముందుకు వెళ్తోన్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు తన 30వ సినిమాను యమ ఉత్సాహంతో చేస్తున్నాడు.
పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన జూనియర్ ఎన్టీఆర్.. కొరటాల శివతో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఇందులో భాగంగా ఫస్ట్ షెడ్యూల్‌ను హైదరాబాద్ శివారు ప్రాంతమైన శంకరపల్లిలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో పూర్తి చేశారు. ఆ వెంటనే రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను జరిపారు.

ఈ రెండింటిలోనూ తారక్‌తో పాటు ముఖ్యమైన పాత్రలను చేస్తున్న స్టార్ల మధ్య కీలకమైన సన్నివేశాలను, యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.
హిట్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో ఐదు భాషల్లో రూపొందిస్తున్నారు. దీంతో పలు ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులను ఇందులో నటింపజేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ చిత్రం బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌ను విలన్‌గా ఎంపిక చేసుకున్నారు.

ఇక, అతడి భార్య పాత్రను మాత్రం ప్రముఖ సీరియల్ హీరోయిన్ చైత్ర రాయ్ (అష్టా చెమ్మా ఫేం) చేస్తున్నట్లు తాజాగా తెలిసింది. ఇప్పటికే ఆమె ఈ సినిమా షూటింగ్‌లో కూడా భాగం అయినట్లు సమాచారం. ఒక సీరియల్ హీరోయిన్ పాన్ ఇండియా మూవీలో భాగం అవడం ఇప్పుడు బుల్లితెరపై హాట్ టాపిక్‌గా మారిపోయింది.
జనతా గ్యారేజ్ హిట్ తర్వాత ఎన్టీఆర్ - కొరటాల కలిసి చేస్తున్న ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీని 2024 ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.


Click it and Unblock the Notifications











