For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మేమంటే చులకనభావం.. మమల్మ్ని నిర్మాతలు బకరాలు చేస్తున్నారు... 7 మూవీ నిర్మాత, ఎన్నారై కిరణ్ ఆవేదన

  |

  విభిన్నమైన కథాంశంతో విడుదలకు సిద్ధమవుతున్న సెవెన్ చిత్రానికి ఎదురుదెబ్బ పడింది. ఈ సినిమాను విడుదల చేయకూడదని హైదరాబాద్ సివిల్ కోర్టు ఇచ్చింది. నిర్మాత రమేష్ వర్మ రూపొందించిన ఈ సినిమాలో హవీష్, రెజీనా, నందితా శ్వేత, పూజిత పొన్నాడ తదితరులు నటించారు. సినిమాటోగ్రాఫర్ నిజర్ షఫీ దర్శకుడిగా మారి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని జూన్ 6వ తేదీన విడుదల చేయాలని నిర్మాత రమేష్ వర్మ ప్లాన్ చేయగా.. ఎన్నారై కిరణ్ కే తలశిల దాఖలు చేసిన పిటిషన్ మేరకు ఈ రిలీజ్‌పై కోర్టు స్టే విధించింది.

  ఈ సందర్భంగా ఎన్నారై కిరణ్ మీడియాలో స్పందించాడు. మీడియా మిత్రులందరికీ
  నమస్కారం!!

  నా పేరు కిరణ్. కిరణ్ కె.తలశిల."సెవెన్" మూవీ విడుదల కాకుండా హైదరాబాద్ సివిల్ కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చింది నేనే.నేను అమెరికాలోని న్యూజెర్సీ లో ఉంటాను.సినిమాలంటే నాకు ప్రాణం.నాకే అని కాదు.. మా ఎన్నారైలందరం అంతే..సినిమాలంటే పడి చేస్తాం!!కానీ మన నిర్మాతలకు మాత్రం ఎన్నారైలంటే చాలా చులకనభావం.మమ్మల్ని బకరాలను చేయడం చాలా సులువనుకుంటారు!!

  SEVEN movie controversy: NRI Kiran K Talashila responded

  మా మంచితనాన్ని చేతగానితనం అనుకుంటారు! అది తప్పు అని నిరూపించేందుకే.. ఈ "స్టే ఆర్డర్".ఈవిధంగా మీ అందరికీ నన్ను నేను పరిచయం చేసుకోవడం చాలా బాధగా ఉన్నా తప్పడం లేదు అని అన్నారు.

  వివాదానికి కారణం ఇదే.. సెవెన్ సినిమాను రూపొందించడానికి రమేష్ వర్మతో నేను భాగస్వామ్య ఒప్పందం చేసుకొన్నాను. సినిమా నిర్మాణం కోసం భారీ మొత్తాన్ని నా నుంచి స్వీకరించారు. ఆ తర్వాత ఒప్పందాన్ని ఉల్లంఘించడం జరిగింది. నేను ఫోన్ చేస్తే కాల్ ఎత్తడం మానేశాడు. అతనిని సంప్రదించడానికి ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదు. చర్చలు జరపడానికి ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. దాంతో తెలుగు ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేశాను. దాని వల్ల కూడా సమస్య పరిష్కారం కాలేదు. దాంతో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించాను. రమేష్ వర్మపై ఫిర్యాదు చేయగా సెవెన్ సినిమాను ఎక్కడ కూడా విడుదల చేయవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది అని కిరణ్ తెలిపారు.

  SEVEN movie controversy: NRI Kiran K Talashila responded

  నటీనటులు: హవీష్, రెజీనా, నందితా శ్వేత, పూజిత పొన్నాడ,
  పి. శ్రీనివాసరావు, రామరాజు, ఏడిద శ్రీరామ్, విద్యులేఖ రామన్, 'జబర్దస్త్' వేణు, ధనరాజ్, సత్య, 'జోష్' రవి, సుదర్శన్, ప్రవీణ్, బాషా, సందీప్, అల్కా రాథోర్, జె.ఎల్. శ్రీనివాస్ తదితరులు.

  స్టిల్స్: శీను,

  ఆర్ట్ డైరెక్టర్: గాంధీ,
  లిరిక్స్: శ్రీమణి, పులగం చిన్నరాయణ, శుభం విశ్వనాధ్,
  కొరియోగ్రఫీ: సతీష్, విజయ్,
  డైలాగ్స్: జీఆర్ మహర్షి,
  స్టంట్స్: వెంకట్ మహేష్,
  ఎడిటర్: ప్రవీణ్ కెఎల్,
  మ్యూజిక్ డైరెక్టర్: చైతన్ భరద్వాజ్,
  కో-ప్రొడ్యూసర్: కిరణ్ కె. తలశిల (న్యూయార్క్),
  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామకృష్ణ,
  స్టోరీ-స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసర్: రమేష్ వర్మ,
  సినిమాటోగ్రఫీ - దర్శకత్వం నిజార్ షఫీ.

  English summary
  Hyderabd civil court issued Stay on the release of the movie SEVEN. As per this Stay Order the movie cant be released anywhere. SEVEN movie is produced by Ramesh Varma starring Havish, Regina, Nanditha swetha, poojitha ponnada etc. Cinematographer Nijar Shafi is turning Director with this movie. NRI Kiran K.Talasila filed complaint against Rameshvarma and got this stay. According to NRI Kiran K.Talasila, Ramesh Varma offered partnership in SEVEN movie and took large amount from him. But latter he refused to honor his commitment and even stopped taking his phone calls. After repeated attempts, NRI Kiran even approached Telugu Film Chamber, but of no use. Hence, he proceeded legally and got STAY !!
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X