సెవెన్ మూవీ రిలీజ్‌పై స్టే ఎత్తివేత.. విడుదలకు లైన్ క్లియర్
హవీష్ కథానాయకుడిగా నిజార్ షఫీ దర్శకత్వంలో రమేష్ వర్మ ప్రొడక్షన్‌లో రమేష్ వర్మ నిర్మించిన సినిమా 'సెవెన్'. తనకు సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం ఇస్తానని రమేష్ వర్మ డబ్బులు తీసుకున్నారని... సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం ఇవ్వలేదని, డబ్బులూ వెనక్కి తిరిగి ఇవ్వలేదని ఎన్నారై కిరణ్ కె. తలశిల కోర్టులో పిటిషన్ వేయడంతో, సినిమా విడుదలపై మంగళవారం హైదరాబాద్ సివిల్ కోర్టు స్టే ఇచ్చింది.
కోర్టు వెలుపల కిరణ్ తలశిలతో 'సెవెన్' నిర్మాత రమేష్ వర్మ సమస్యను పరిష్కరించుకున్నారు. దాంతో సినిమా విడుదలపై తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని కిరణ్ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేయడంతో 'సెవెన్' విడుదలకు లైన్ క్లియర్ అయింది.

వివాదానికి కారణం ఇదే.. సెవెన్ సినిమాను రూపొందించడానికి రమేష్ వర్మతో నేను భాగస్వామ్య ఒప్పందం చేసుకొన్నాను. సినిమా నిర్మాణం కోసం భారీ మొత్తాన్ని నా నుంచి స్వీకరించారు. ఆ తర్వాత ఒప్పందాన్ని ఉల్లంఘించడం జరిగింది. నేను ఫోన్ చేస్తే కాల్ ఎత్తడం మానేశాడు. అతనిని సంప్రదించడానికి ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదు. చర్చలు జరపడానికి ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. దాంతో తెలుగు ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేశాను. దాని వల్ల కూడా సమస్య పరిష్కారం కాలేదు. దాంతో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించాను. రమేష్ వర్మపై ఫిర్యాదు చేయగా సెవెన్ సినిమాను ఎక్కడ కూడా విడుదల చేయవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది అని కిరణ్ తెలిపారు.
నిజార్ షఫీ దర్శకత్వంలో హవీష్ హీరోగా, రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ హీరోయిన్లుగా రూపొందిన ఈ సినిమా ఈ రోజు పెయిడ్ ప్రీమియర్ షోలతో సినిమా విడుదలవుతోంది.గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











