Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘సెవెన్’ హాలీవుడ్ సినిమాలా ఉంటుందట.. అభిషేక్ ఫిక్చర్స్ క్రేజీ ఆఫర్
హవీష్ హీరోగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్, రమేష్ వర్మ ప్రొడక్షన్స్ బేనర్లో రమేష్ వర్మ నిర్మాతగా తెరకెక్కిన చిత్రం 'సెవెన్'. ఏడుగురు అమ్మాయిలతో హీరో ప్రేమ వ్యవహారం నడిపించే విభిన్నమైన రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలు.
రమేష్ వర్మ కథ అందించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఇప్పటికే శుభం విశ్వనాధ్ సాహిత్యం అందించిన 'సంపోద్దోయ్ నన్నే', పులగం చిన్నారాయణ సాహిత్యం అందించిన 'ఇదివరకెపుడు తెలియదు' పాటలు విడుదలయ్యాయి. జూన్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
సినిమా ఫస్ట్ కాపీ చూసిన అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా క్రేజీ ఆఫర్ ఇచ్చి సినిమా ప్రపంచవ్యాప్త థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ ఇది మైండ్ బ్లోయింగ్ ఫిల్మ్. థ్రిల్లర్ ఫిల్మ్స్‌లో సరికొత్త ట్రెండ్ సృష్టించడం ఖాయం. ఒక ట్విస్ట్ వెనుక మరొక ట్విస్ట్ ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేస్తాయన్నారు. ప్రేక్షకులకు ఒక హాలీవుడ్ సినిమా చూసిన అనుభూతి ఈ సినిమా ఇస్తుంది. సినిమా బాగా నచ్చడంతో వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ తీసుకున్నాను. జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా మా సంస్థ ద్వారా చిత్రాన్ని విడుదల చేస్తున్నామని తెలిపారు.
ఈ చిత్రంలో ఇంకా పి. శ్రీనివాసరావు, రామరాజు, ఏడిద శ్రీరామ్, విద్యులేఖ రామన్, 'జబర్దస్త్' వేణు, ధనరాజ్, సత్య, 'జోష్' రవి, సుదర్శన్, ప్రవీణ్, బాషా, సందీప్, అల్కా రాథోర్, జె.ఎల్. శ్రీనివాస్ తదితరులు.
స్టిల్స్: శీను, పీఆర్వో: సురేంద్ర కుమార్ నాయుడు - ఫణి కందుకూరి, డీఐ: లెజెండ్ స్టూడియో, కలరిస్ట్ రంగ, వి.ఎఫ్.ఎక్స్: ప్రసాద్ గ్రూప్, చీఫ్ కో-డైరెక్టర్: వేణు పిళ్ళై, కో-డైరెక్టర్: జగన్నాథ్ ఎం.ఆర్(రమేష్), ఆర్ట్ డైరెక్టర్: గాంధీ, లిరిక్స్: శ్రీమణి, పులగం చిన్నరాయణ, శుభం విశ్వనాధ్, కొరియోగ్రఫీ: సతీష్, విజయ్, డైలాగ్స్: జీఆర్ మహర్షి, స్టంట్స్: వెంకట్ మహేష్, ఎడిటర్: ప్రవీణ్ కెఎల్, మ్యూజిక్ డైరెక్టర్: చైతన్ భరద్వాజ్, కో-ప్రొడ్యూసర్: కిరణ్ కె. తలశిల (న్యూయార్క్), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామకృష్ణ, స్టోరీ-స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసర్: రమేష్ వర్మ, సినిమాటోగ్రఫీ - దర్శకత్వం నిజార్ షఫీ.