2.0 మోడ్ ఆన్.. రజని సినిమా అంటే అంతే.. కోయంబత్తూర్‌లో ఏం జరిగిందంటే!
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2.0 చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. దిగ్గజ దర్శకుడు శంకర్ రూపించిన చిత్రంలో రజని, అక్షయ్ కుమార్ నటించడంతో దేశ వ్యాప్తంగా ఈ చిత్రానికి మరింత క్రేజ్ పెరిగింది. భారత సినిమాకు గర్వకారణం అంటూ 2.0పై, శంకర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి తోడు రజనీకాంత్ ఫ్యాన్స్ చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శంకర్, రజనీకాంత్ సినిమాలకు సాధారణంగానే ఆకాశాన్ని తాకే అంచనాలు నెలకొని ఉంటాయి. ఇక 600 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందిన ఈ చిత్రం కోసం అభిమానులు ఎలా ఎదురుచూస్తుంటారో అర్థం చేసుకోవచ్చు.

రజనీకాంత్ క్రేజ్
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా విడుదలవుతుందటే.. విద్యార్థులు కాలేజీలకు డుమ్మా కొట్టడం, ఉద్యోగులు ఆఫీసులకు సెలవులు పెట్టడం షరా మామూలే. రజనీకాంత్ అభిమానుల ఉత్సాహాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని సంస్థలు సినిమా విడుదల రోజు సెలవులు ప్రకటిస్తుంటాయి. తాజా తమిళనాడులో పలు సంస్థలు అదే పని చేశాయి.

కోయంబత్తూర్‌లో ఏం జరిగిందంటే
ఇదిలా ఉండగా కోయంబత్తూర్ కు చెందిన గెట్ సెట్ గో అనే సంస్థ తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2.0 విడుదల కారణంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నాం అంటూ ఆ సంస్థ యాజమాన్యం పేర్కొంది. శంకర్ దర్శత్వంలో రూపొందిన 2.0 భారత సినిమాకు గర్వకారణం అని పేర్కొంది.

బంపర్ ఆఫర్
కేవలం సెలవు ప్రకటించడం మాత్రమే కాదు.. తమ ఉద్యోగులకు ఉచితంగా సినిమా టికెట్స్ కూడా అందిస్తున్నాం అని గెట్ సెట్ గో సంస్థ యాజమాన్యం పేర్కొంది. ఎక్కడ చూసినా రజనీకాంత్ అభిమానులే ఉంటారు. మా సంస్థలో కూడా ఉన్నారు. ఈ ప్రత్యేకమైన సదర్భంగాలో ఉద్యోగులకు సంతోషాన్ని కలిగించే నిర్ణయం తీసుకున్నాం అని తెలిపింది. ఈ మేరకు 2.0 మోడ్ ఆన్ అంటూ అధికారిక ప్రకటనని విడుదల చేసింది.

ఫ్యాన్స్ హంగామా
బుధవారం రాత్రి నుంచే రజనీకాంత్ అభిమానుల కోలాహలం మొదలయింది. అమీ జాక్సన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. సినిమాకు మొదటి షో నుంచే మంచి రెస్పాన్స్ వస్తుండడం విశేషం. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉందనే ప్రశంసలు లభిస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఈ చిత్రంలో విజువల్స్ రూపొందించారు.


Click it and Unblock the Notifications











