Shaakuntalam ప్రీమియర్ షో.. అల్లు అర్హ క్యారెక్టర్ ఎలా ఉందంటే..

సమంత లీడ్ రోల్ లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ శాకుంతలం రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలు ప్రస్తుతం హడావుడిగా జరుగుతున్నాయి. భారీ బడ్జెట్ తో దిల్ రాజు, నీలిమ గుణ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఇక సినిమాపై హైప్ పెంచేందుకు అఫీషియల్ రిలీజ్ డేట్ కంటే ముందుగానే ప్రీమియర్ షోలను ప్రదర్శిస్తున్నారు. ఇక హైదరాబాద్ లో కూడా కొన్ని స్పెషల్ షోలు వేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక అందులో అర్హ క్యారెక్టర్ ఎలా ఉంది అనే వివరాల్లోకి వెళితే...

శాకుంతలంపై అంచనాలు:శాకుంతలం కచ్చితంగా సిల్వర్ స్క్రీన్ పై బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంటుంది అని అంచనా అందరిలో ఉంది. గత కొంత కాలంగా వరుస ఫ్లాప్స్ ఎదుర్కొంటున్న దర్శకుడు గుణశేఖర్ ఎలాగైనా ఈ సినిమాతో సక్సెస్ అందుకోవాలి అని చూస్తున్నారు. ఇక శాకుంతలం సినిమా ఈ నెల 14న 3D లో వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు.

Shaakuntalam movie premiere show talk allu arha charecter highlights

కంటెంట్ మీద నమ్మకంతో:అయితే సినిమా కంటెంట్ మీద నమ్మకంతో చిత్ర యూనిట్ సభ్యులు ప్రత్యేకంగా కొన్ని స్పెషల్ ప్రీమియర్ షోలు కూడా వేశారు. హైదరాబాద్ లో మంగళవారం వేసిన షోలకు మంచి టాక్ వచ్చినట్లు తెలుస్తోంది. 3D లో చూసిన వారు సినిమాపై పాజిటివ్ గానే రియాక్ట్ అవుతున్నారు. ఇక సినిమాలో గ్రాఫిక్స్ కూడా పరవాలేదు అనే విధంగా ఉన్నాయని అంటున్నారు.

అల్లు అర్హ క్యారెక్టర్:ఇక ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ చైల్డ్ యాక్టర్ గా తెరంగేట్రం చేస్తోన్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికే టీజర్ ట్రైలర్ ద్వారా అల్లు అర్హ క్యారెక్టర్ ని గుణశేఖర్ రివీల్ చేశారు. సింహంపై కూర్చొని వస్తున్న అల్లు అర్హని టీజర్ లో చూపించరు. ఈ విజువల్ సాధారణ ప్రేక్షకులతో పాటు బన్నీ ఫ్యాన్స్ కి కూడా భాగా కనెక్ట్ అయ్యిందని చెప్పాలి.

Shaakuntalam movie premiere show talk allu arha charecter highlights

అర్హ పాత్ర ఎలా ఉందంటే..:ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబందించిన ప్రీమియర్ షోలు ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ షోలు మెజారిటీ ఆడియన్స్ క్లైమాక్స్ లో అల్లు అర్హ నటన గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఉండటం విశేషం. బిగ్ స్క్రీన్ పై నటించడం మొదటి సారి అయిన కూడా ఎలాంటి బెరుకు లేకుండా డైలాగ్స్ చెప్పిన విధానం అద్భుతంగా ఉందనే ప్రశంసలు వస్తున్నాయి. సినిమాలో కనిపించేది కొద్ది సేపే అయినా కూడా సర్ ప్రైజ్ చేసే విధంగా అర్హ నటన ఉందనే మాట వినిపిస్తోంది.

డైలాగ్స్ హైలెట్:ఉన్నదీ కొద్ది నిమిషాలే అయినా కూడా గ్రాంధికంలో తెలుగు సంభాషణలలు ఎలాంటి తడబాటు లేకుండా చెప్పిందని ప్రశంసించారు. ఈ జెనరేషన్ లో పిల్లలకి అస్సలు తెలుగు మాట్లాడటం కూడా రావడం లేదని, అయితే అర్హ మాత్రం అనర్గళంగా తెలుగులో మాట్లాడటం, పెద్ద పెద్ద డైలాగ్స్ ని కూడా చాలా ఈజీగా చెప్పేయడం చూస్తుంటే నిజంగా అర్హకి మంచి ఫ్యూచర్ ఉంటుందనే కితాబు లభిస్తుంది.

Shaakuntalam

ఆ సీన్ లో హైలెట్..:ఇప్పటికే సినిమాలో ఆమె పాత్ర కచ్చితంగా అందరిని సర్ ప్రైజ్ చేస్తుందని గుణశేఖర్, సమంత పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దానికి తగ్గట్లుగానే క్లైమాక్స్ సన్నివేశాలలో దుష్యంతుడు, భరతుడి పాత్రల మధ్య వచ్చే సంభాషణలని ఆమె ఎలాంటి తడబాటు లేకుండా చెప్పిందనే టాక్ వినిపిస్తోంది. కెమెరా ఫియర్ కూడా లేకుండా సంభాషణలు పలికి ఆశ్చర్యపరిచింది అని ప్రీమియర్స్ చూసిన వారు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో కచ్చితంగా అల్లు అర్హని స్క్రీన్ పై చూసే బన్నీ ఫ్యాన్స్ మరింత హ్యాపీ గా ఫీల్ అవుతారనే అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X