మిథాలీ రాజ్‌గా తాప్సీ.. అదిరిపోయిన ఫస్ట్ లుక్
వెండితెరపై బయోపిక్‌లు రాజ్యమేలుతున్నాయి. క్రీడల్లో ఎంతో ఎత్తుకు ఎదిగిన వారి చిత్రాలు వెండితెరపైనా అద్భుతమైన విజయాలు నటించారు. భాగ్ మిల్కా భాగ్, మేరీ కోమ్, ఎమ్ ఎస్ ధోని వంటి చిత్రాలు ఈ కోవకు చెందినవే. తాజాగా మరికొన్ని స్పోర్ట్స్ బయోపిక్స్ వెండితెరపై సందడి చేసేందుకు సిద్దమవుతున్నాయి. సైనా నెహ్వాల్, పుల్లెల గోపీచంద్, మిథాలీ రాజ్ వంటి వారి కథలను ఆధారంగా చేసుకుని సినిమాలు రాబోతోన్నాయి. వీటిల్లోంచి.. మిథాలీ రాజ్ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్ వచ్చేసింది.
మహిళా క్రికెట్‌లో ఎన్నో సంచలనాలు నమోదు చేసిన మిథాలీ రాజ్ జీవిత చరిత్ర సినిమాగా రాబోతోంది. శభాస్ మిథాలీ అనే టైటిల్‌తో రాబోతోన్న చిత్రంలో మిథాలీగా తాప్సీ నటిస్తోంది. క్రికెటర్‌గా సహజంగా కనిపించేందుకు క్రీడలోని మెలుకువలను కూడా నేర్చుకుంది తాప్సీ. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

ఒకానొక సమయంలో మిథాలీ రాజ్‌ను.. మీకు ఇష్టమైన మేల్ క్రికెటర్ ఎవరు? అని మీడియా ప్రశ్నించగా.. 'మీకు ఇష్టమైన ఉమెన్ క్రికెటర్ ఎవరని వారిని అడగండి'అని సమాధానమిచ్చి ఎందరిలోనూ ఆలోచనలను రేకెత్తించింది. ఆటను ఇష్టపడుతున్నారా? వారు మగవారా? ఆడవారా? అని చూస్తున్నారా? అని ఆలోచించేలా చేశారని తాప్సీ ట్వీట్ చేస్తూ.. ఫస్ట్ లుక్‌ను పోస్ట్ చేసింది. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











