ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం ఆర్యన్‌తో కలిసి షారుక్.. అబ్‌రామ్‌తోపాటు

వరుస ఫ్లాప్‌లతో తల్లడిల్లుతున్న షారుక్ ఖాన్ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లో భాగమయ్యాడు. అయితే యాక్టింగ్ పరంగా కాకుండా డబ్బింగ్ పరంగా క్రేజీగా మారాడు. త్వరలోనే హాలీవుడ్ చిత్రం ది లయన్ కింగ్ రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమాను హిందీలో డబ్బింగ్ చేస్తుననారు. ఈ సినిమాలోని ముఫాసా పాత్ర కోసం షారుక్ ఖాన్, సింహా పాత్ర కోసం ఆయన తనయుడు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పడం మీడియా హెడ్‌లైన్లను ఆకర్షించింది.

ది లయన్ కింగ్ సినిమాలోని పాత్ర కోసం డబ్బింగ్ చెప్పడంపై షారుక్ సోషల్ మీడియాలో స్పందించారు. లయన్ కింగ్ సినిమా ప్రయాణంలో నేను భాగం కావడం గర్వంగా ఉంది. తరాలు మారిన ఎప్పటికీ ఎవర్ గ్రీన్ చిత్రం ది లయన్ కింగ్. 15 ఏళ్ల క్రితం ఇలాంటి అనుభవాన్ని రుచి చూశాను. మరోసారి కొత్త అనుభూతి. ఈ సినిమా జూలై 18న రిలీజ్ అవుతున్నది. మరిచిపోకుండా తప్పుకుండా చూడాలి అంటూ షారుక్ ట్వీట్ చేశారు.

Shah Rukh Khan and Aryan Khan dubbing for The Lion King

నా కుమారుడు ఆర్యన్‌తో కలిసి లయన్ కింగ్ సినిమాకు డబ్బింగ్ చెప్పడం మధురమైన అనుభూతి. ఇది వ్యక్తిగతంగాను, ప్రొఫెషనల్‌గా కూడా ఎంతో తృప్తిని ఇచ్చింది. నా చిన్న కుమారుడు అబ్‌రామ్‌తో కలిసి చూడబోతుండటం మరో గొప్ప అనుభూతి. ది లయన్ కింగ్‌ సినిమా అంటే అబ్‌రామ్‌కు ఎంతో ఇష్టం అని ఆంగ్ల మీడియాతో అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X