పహల్గాం ఎటాక్.. 2012కు ముందే షారుఖ్ కు హెచ్చరిక.. అందుకే కాశ్మీర్ కు వెళ్లని కింగ్ ఖాన్
కింగ్ ఖాన్, బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ దేశ వ్యాప్తంగా నటుడిగా కీర్తి పొందుతున్నారు. అగ్ర నటుడిగా, సినిమా నిర్మాతగా, వ్యాపార వేత్తగా షారుఖ్ ఖాన్ తన జీవితంలో క్రీయా శీలక పాత్రలు పోషిస్తున్నారు. 1988 నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. 30 ఏళ్ల కెరీయర్ లో షారుఖ్ ఖాన్ 100కు పైగా సినిమాల్లో నటించారు. దివానా, బాజీ ఘర్ వంటి చిత్రాలతో మొదలై.. దిల్ వాలే దుల్హానియా లే జాయేగా, దిల్ తో పాగల్ హై, కుచ్ కుచ్ హోతా హై, కబీ ఖుషి కబీ గమ్ వంటి చిత్రాలతో 90లో దుమ్ములేపాడు. అనతి కాలంలోనే స్టార్ డమ్ దక్కించుకున్నారు.
ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో గల పహల్గాంలోని అందమైన బైసరన్ లోయలో టెర్రరిస్టుల దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఏకంగా 26 మందిని టెర్రరిస్టులు మతం పేరు అడిగి మరీ కాల్చి చంపడం దేశాన్ని శోఖ సంద్రంలోకి పడేసింది. దాడికి సంబంధించిన వీడియోలను వదలడంతో దేశం మొత్తం ఉలిక్కి పడింది. సోషల్ మీడియా వేదికన ప్రజులు మృతుల కుటుంబాలకు పెద్ద ఎత్తున సానుభూతి వ్యక్తం చేశారు. టెర్రరిస్టులను అంతమొందించాలని నినదించారు. దీనిపై సినీ తారలు చిరంజీవి, అల్లు అర్జున్, మహేశ్ బాబు, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, నాని, విజయ్ దేవరకొండ, సోనూ సూద్ స్పందించారు. పహల్గాంలో జరిగిన టెర్రరిస్టుల దాడి పట్ల విచారం వ్యక్తం చేశారు.

మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కూడా కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన టెర్రరిస్టుల దాడికి విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్ కు సంబంధించిన ఓ వార్త వైరల్ గా మారింది. షారుఖ్ ఖాన్ 2012కు ముందు అస్సలు తను కాశ్మీర్ కు వెళ్ల కూడదని నిర్ణయించుకున్నారంట. అందుకు కారణం మరోవరో కాదు. తన తండ్రి అని షారుఖ్ గత వీడియోలో చెప్పారు. షారుఖ్ ఖాన్ కు తనే తండ్రి స్వయంగా కాశ్మీర్ చూపిస్తానని, నేను లేకుండా వెళ్ల కూడదని చెప్పారంట. అందుకే 2012 వరకు ఎన్నో సార్లు వెళ్లే అవకాశం వచ్చినా వెళ్లలేదంట.
పహల్గాంలోని అందమైన దృశ్యాలను కుటుంబంతో కలిసి కూడా చూడలేకపోయానని చెప్పారు. తన తండ్రి చూపిస్తాననడంతో వెళ్లలేదని, మరోవైపు తన తండ్రి కూడా నేను చూపించే వరకు వెళ్ల కూడదని అన్నారంట. కానీ 'జబ్ తక్ హై జాన్' సినిమా షూటింగ్ సమయంలో కాశ్మీర్ రీజియన్ లోకి అడుగు పెట్టాల్సి వచ్చిందన్నారు. ఆ రోజు షారుఖ్ ఎంతో భావోద్వేగం అయ్యారు. తన తండ్రి ఒడిలోనే ఉన్నట్టుగా ఉందని సోషల్ మీడియా పోస్టు కూడా చేశారు. అయితే ఇదంతా గతంలో షారుఖ్ ఖాన్ చెప్పుకొచ్చారు.
తాజాగా కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడి జరగడంతో కొన్నేళ్ల పాటు షారుఖ్ ఖాన్ కాశ్మీర్ కు ఎందుకు వెళ్లలేదనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ఎంతో చక్కటి జీవితాన్ని చూడల్సిన కుటుంబాలు టెర్రరిస్టుల దాడితో చిన్నాభిన్నం కావడంతో షారుఖ్ ఖాన్ ఎంతో బాధపడ్డారు. ఆయన అభిమానులు కూడా చింతించారు. ఇక మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. పాకిస్థాన్ పై కఠిన నిర్ణయాలు తీసుకొని తక్షణమే అమలు పరుస్తోంది.


Click it and Unblock the Notifications











