IPL 2024: సురేష్ రైనా, పార్థీవ్ పటేల్‌కు సారీ చెప్పిన షారుక్ ఖాన్.. ఏం జరిగిందంటే?

ఐపీఎల్‌ 2024 లో భాగంగా మంగళవారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో కోల్ కతా నైట్ రైడర్స్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తన జట్టు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్‌లోకి దూసుకెళ్తిన నేపథ్యంలో బాలీవుడ్ బాద్షా, KKR యజమాని షారుక్ ఖాన్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపేందుకు స్టేడియంలోకి వచ్చి చుట్టూ తిరుగుతూ కనిపించారు.ఈ సందర్భంగా క్రికెటర్లు సురేష్ రైనా, పార్థీవ్ పటేల్‌కు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ టోర్నిలో తొలి ఫ్లేఆఫ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఘన విజయం సాధించింది. ఈ ఆనందంలో షారుక్ ఖాన్ తన సిబ్బందితో కలిసి స్టేడియంలోకి వచ్చి..ఇప్పటి వరకు ఆదరించిన తన ఫ్యాన్స్, క్రికెట్ అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ.. చేతులు ఊపుతూ స్టేడియంలో నడుచుకుంటూ వెళ్తున్నారు.

Shah Rukh Khan rendered apology to Suresh Raina Parthiv Patel at IPL Play off Match

అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత క్రికెటర్ల పార్థీవ్ పటేల్, సురైష్ రైనాను టెలివిజన్‌ క్రూ ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో కెమెరామెన్‌కు క్రికెటర్లకు మధ్య షారుక్ ఖాన్ చూసుకోకుండా వచ్చారు. అక్కడ ఇంటర్వ్యూ జరుగుతుందని గమనించిన షారుక్ ఖాన్ వెంటనే వారిని చూసి పక్కకు తప్పుకొన్నాడు. వెంటనే సారీ.. క్షమించండి అంటూ వినయంగా వేడుకొన్నాడు.

Shah Rukh Khan rendered apology to Suresh Raina Parthiv Patel at IPL Play off Match

దాంతో షారుక్ ఖాన్‌ను చూసిన రైనా, పటేల్, క్రూ సిబ్బంది ఆనందంలో మునిగిపోయారు. అదేం లేదు. ఫర్వాలేదు అంటూ కామెంటేటర్ నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు. అయితే రైనా, పార్టీవ్‌కు హగ్ ఇచ్చి.. అక్కడి నుంచి షారుక్ వెళ్లిపోయాడు. ఓ జట్టు యజమాని, అలాగే ఇండియన్ సూపర్ స్టార్ అయి ఉండి కూడా చాలా ఒద్దికగా.. వినమ్రంగా ఉండటం చూసి వారంతా ముచ్చటపడిపోయారు.

అయితే షారుక్ వ్యవహరించిన తీరుపై ప్రశంసలు వస్తున్నాయి. అందుకే ఆయన అంత పెద్ద స్టార్ అయ్యారు. ఎదుటి వారిపట్ల వ్యవహరించే తీరు చూస్తే అందరూ ఫిదా అవుతారు. సినిమాల్లోనే కాదు.. క్రికెట్‌లో విజయ పథాన నడుస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X