twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెర్సల్ రీమేక్‌పై చర్చలు.. హీరో ఎవరో తెలుసా!

    |

    స్టార్ హీరో విజయ్, యువ దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో వచ్చిన మెర్సల్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. విజయ్ ఈ చిత్రంలో డ్యూయెల్ రోల్ లో అదరగొట్టాడు. మెడికల్ మాఫియా అంశంతో తెరకెక్కిన ఈ చిత్రం విజయ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రంపై అనేక వివాదాలు కూడా ఎదురయ్యాయి. మెర్సల్ చిత్రాన్ని అదిరింది పేరుతో తెలుగులోకి డబ్ చేసి విడుదల చేశారు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    ఇటీవల చెన్నై, కోల్ కతా మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో అట్లీ కనిపించాడు. దీనితో మెర్సల్ చిత్ర హిందీ రీమేక్ గురించి మరింత జోరుగా చర్చ జరుగుతోంది. అట్లీ లాంటి ప్రతిభావంతుడైన దర్శకుడుని బాలీవుడ్ కు తీసుకెళ్లాలని భావిస్తున్నాడట. మెర్సల్ హిందీ రీమేక్ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు బాలీవుడ్ లో జోరుగా చర్చ జరుగుతోంది.

    Shah Rukh Khan teaming up with Mersal director Atlee Kumar for his next

    అట్లీ, షారుఖ్ కలయిక గురించి మరో ఆసక్తికర ప్రచారం కూడా జరుగుతోంది. ప్రస్తుతం అట్లీ, విజయ్ కాంబోలో ఫుట్ బాల్ క్రీడ నేపథ్యంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో షారుఖ్ గెస్ట్ రోల్ లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    English summary
    Shah Rukh Khan teaming up with Mersal director Atlee Kumar for his next
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X