అట్లీతో కాదట.. మరో తమిళ క్రేజీ డైరెక్టర్‌తో షారుక్ సినిమా.. వైరల్‌గా

బాలీవుడ్‌ బాద్షా షారుక్ ఖాన్‌ తమిళ దర్శకుడితో సినిమా చేస్తున్నారనే విషయం మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. ఇలాంటి వార్తల నేపథ్యంలో సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీతో షారుక్ కలువడం మరింత క్రేజీగా మారింది. తాజాగా జరిగిన షారుక్ ఖాన్ జన్మదిన వేడుకలకు తన భార్య ప్రియాతో అట్లీ హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో షారుక్ ఖాన్ దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అనేక వార్తలు బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్నది. అంతేకాకుండా అట్లీతో జతకట్టి షారుక్ ఖాన్ సినిమా చేస్తున్నారనే వార్త బాద్షా ఫ్యాన్స్‌లో సంతోషాన్ని నింపింది.

అయితే కేవలం షారుక్ బర్త్ డే సెలబ్రేషన్స్‌కు మాత్రమే హాజరయ్యారు. అందులో విశేషమేమీ లేదు. సినిమా గురించి కలిసారనే వార్త అవాస్తవం. మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు అనే సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

Shah Rukh Khan to work with Asuran Director Vetri maran

ఇదిలా ఉండగా, షారుక్ తన తదుపరి సినిమాను వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాననే విషయాన్ని తన జన్మదినం రోజున వెల్లడించారు. అయితే ఆ చిత్రానికి వెట్రి మారన్ దర్శకత్వం వహిస్తున్నారని, అంతేకాకుండా మూవీ పేరును సన్కీ (తిక్కలోడు) అనే టైటిల్‌ను ఖారారు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం అసురన్ అనే చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని వెట్రీ మారన్ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాపై అధికార ప్రకటన త్వరలోనే చేయనున్నారనే వార్త మీడియాలో హల్‌చల్ చేస్తున్నది.

కాగా, షారుక్ ఖాన్ కెరీర్ ప్రస్తుతం చాలా క్లిష్టపరిస్థుతుల్లో ఉంది. ఆయన నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చాలా దారుణంగా బోల్తా కొట్టాయి. దాంతో గత ఏడాది కాలానికిపైగా సినిమాలు అంగీకరించలేదు. ప్రమంచి ప్రాజెక్టుల కోసం ఎదురు చూస్తున్నారు. షారుక్ ఖాన్ నటించిన ఫ్యాన్, డియర్ జిందగీ, ట్యూబ్ లైట్, జబ్ హ్యారీ మెట్ సెజల్, జీరో చిత్రాలు దారుణమైన పరాజయాన్ని మూట్టుకొన్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X