షారుక్ చిన్న కొడుకు అబ్‌రామ్ బాలీవుడ్ ఎంట్రీ.. హిస్టారికల్ ప్రాజెక్టులో తండ్రి, సోదరుడు ఆర్యన్‌తో కలిసి!

భారతీయ సినిమా పరిశ్రమలో వారసులను పరిచయం చేయడం అగ్ర హీరోలకు కొత్తేమీ కాదు. వారసులతో కలిసి నటించడం కూడా గతంలో జరిగాయి. అయితే తాజాగా ఓ సినిమా కోసం షారుక్ ఖాన్ తన తనయులు ఆర్యన్ ఖాన్, అబ్‌రామ్ ఖాన్‌తో కలిసి పనిచేయడం విశేషంగా మారింది. ఆ సినిమా బాలీవుడ్ సినిమా కాకుండా హలీవుడ్ సినిమా కావడం మరింత ప్రత్యేకతను సంతరించుకొన్నది. అయితే ఈ ముగ్గురు తెర వెనుక కలిసి సినిమాలో భాగస్వామ్యం పంచుకోవడం కొత్తగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే.,,

ప్రపంచ పినిమాలో లయన్ కింగ్ సినిమాకు ప్రత్యేకమైన ఆదరణ ఉంది. కేవలం ఓ భాషకు పరిమితం కాకుండా గ్లోబ్ మీద ఉన్న అన్ని భాషల వారికి లయన్ కింగ్ ఎంతో ఇష్టం. అలాంటి కథా నేపథ్యంతో వస్తున్న చిత్రం ముఫాసా: ది లయన్ కింగ్. ఈ సినిమాకు బ్యారీ జెర్కిన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం భారత్‌లో హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ భాషల్లో డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ అవుతున్నది.

Shah Rukh Khan s Son Ab Ram to part of Mufasa The Lion King with his father and brother Aryan Khan

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల రిలీజైన ముఫాసా: ది లయన్ కింగ్ సినిమా ట్రైలర్‌కు అనూహ్యమైన ఆదరణ దక్కింది. రికార్డు స్థాయిలో వ్యూస్ నమోదు అయ్యాయి. దాంతో ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. అలాగే ఈ మూవీ మోస్ట్ అవైటింగ్ సినిమాగా మారింది.

అయితే ఈ సినిమాలో షారుక్, ఆయన కుమారులు ఆర్యన్ ఖాన్, అబ్ రామ్ ఖాన్ భాగమవుతున్నారు. అయితే ఈ సినిమాలో తెర ముందుకు కాకుండా పాత్రలకు తమ గాత్రాన్ని అరువుగా ఇవ్వనున్నారు. యానిమేషన్ సినిమాగా రూపొందే ఈ చిత్రంలో ముఫాసా పాత్రకు షారుక్ ఖాన్, సింబా రోల్‌కు ఆర్యన్ ఖాన్, కుర్ర ముఫాసాకు అబ్‌రామ్ డబ్బింగ్ చెప్పడం ఓ రికార్డుగా మారింది.

Shah Rukh Khan s Son Ab Ram to part of Mufasa The Lion King with his father and brother Aryan Khan

లయన్ కింగ్ సినిమాతో అనుబంధం కావడంపై షారుక్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఓ లెగసీతో కూడిన ముఫాసా పాత్ర అడవికి చివరి రారాజు. సింబాకు తన జ్ఞానాన్ని తెలివి తేటలను బోధిస్తుంది. అలాంటి తండ్రి పాత్రకు నేను బాగా కనెక్ట్ అయ్యాను.ముఫాసా జర్నీ అంటే నాకు ఇష్టం. నా చిన్నతనం నుంచి ముఫాసాతో ట్రావెల్ అవుతున్నాను. అలాంటి గొప్ప సినిమాకు పనిచేసే అవకాశం ఇచ్చిన డీస్నీ+స్టార్ ధన్యవాదాలు. నా కొడుకులు ఆర్యన్, అబ్ రామ్‌తో కలిసి పనిచేయడం ఇంకా సంతోషంగా ఉంది. వారితో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతిని క్రియేట్ చేసింది అని షారుక్ తన అనుభవాలను పంచుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X