twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కబీర్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: పిచ్చెక్కించే పెర్ఫార్మెన్స్.. గ్రౌండ్ రిపోర్ట్ ఏంటంటే

    |

    Recommended Video

    Kabir Singh Movie Twitter Review || కబీర్ సింగ్ ట్విట్టర్ రివ్యూ || Filmibeat Telugu

    టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన 'అర్జున్ రెడ్డి' సినిమాకు రీమేక్‌గా హిందీలో 'కబీర్ సింగ్' మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాకు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగానే కబీర్ సింగ్‌ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ రోజే (జూన్ 21) కబీర్ సింగ్ విడుదల కానున్న నేపథ్యంలో ఒక రోజు ముందుగానే విదేశాల్లో ఈ సినిమాను ప్రదర్శించడం జరిగింది. కబీర్ సింగ్ చూసిన కొందరు ప్రముఖులు, ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఆ వివారాలు చూస్తే..

    పవన్ కల్యాణ్‌ను అలా ఓడించారు.. బాహుబలిని మించేలా సైరా.. నాగబాబు షాకింగ్ కామెంట్స్ <br>పవన్ కల్యాణ్‌ను అలా ఓడించారు.. బాహుబలిని మించేలా సైరా.. నాగబాబు షాకింగ్ కామెంట్స్

    తరుణ్ ఆదర్శ్ ట్వీట్

    సినీ విశ్లేషకులు తరుణ్ ఆదర్శ్ కబీర్ సింగ్ పవర్ ఫుల్ అని ఒక్క మాటలో చెప్పేశారు. హీరో షాహిద్ కపూర్ తన కెరీర్ లోనే బెస్ట్ పర్‌ఫార్‌మెన్స్ కనబర్చాడు. కియారా లవ్లీ, సందీప్ రెడ్డి వంగా అంటేనే ఓ నమ్మశక్యం స్టోరీ టెల్లర్. చిత్ర రన్ టైమ్ కాస్త ఇబ్బంది పెట్టింది.

    విజయ్ దేవరకొండ ట్వీట్

    డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఓ అద్భుతమైన స్టోరీ టెల్లర్. ఓ విజన్ తో కూడిన స్టోరీ చెప్పడంలో ఆయన్ను సందీప్ రెడ్డి భేష్ అనిపించే డైరెక్టర్. నా ఎనర్జీకి మించిన ఫైర్ ప్లేస్ చూశాను. కబీర్ సింగ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నా (4/4).

    నేహా దుపియా రెస్పాన్స్

    షాహిద్ కపూర్ గురించి చెప్పడానికి మాటలు చాలవు. ఇంకా కాసేపు థియేటర్ లోనే కూర్చొని సినిమా ఆస్వాదించాలని అనిపించింది. కబీర్ సింగ్ సినిమా చాలా చాలా బాగుంది.

    ఇప్పటి నుంచి షాహిద్ కపూర్ ఫ్యాన్ అయ్యా

    కబీర్ సింగ్ సినిమాను దుబాయ్ లో చూశాను. మొదటిసారి ఓ భారతీయ సినిమాను దుబాయ్ థియేటర్ లో చూశాను. షాహిద్ కపూర్ అదరగొట్టేశాడు. ఆయనలో మంచి టాలెంట్ ఉంది. ఇప్పటి నుంచి షాహిద్ కపూర్ ఫ్యాన్ గా మారిపోతున్నా అని దుబాయ్ నుంచి ఓ వ్యక్తి ట్వీట్ పెట్టాడు.

    ఫస్ట్ ఆఫ్ అదిరింది.. మైండ్ బ్లోయింగ్

    కబీర్ సింగ్ సినిమాలో ఫస్ట్ ఆఫ్ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ లో వచ్చిన ప్రతీ సన్నివేశానికి షాహిద్ కపూర్ ఓ అవార్డు అందుకోవాల్సిందే. మైండ్ బ్లోయింగ్ పర్‌ఫార్‌మెన్స్ బై షాహిద్ కపూర్.

    తప్పకుండా చూడాల్సిన సినిమా

    కబీర్ సింగ్ సినిమా సూపర్. 2019 లో ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాల్లో ఇదే ది బెస్ట్. షాహిద్ కపూర్ అబ్బురపరిచే నటన కనబర్చాడు. తప్పకుండా చూడాల్సిన సినిమా కబీర్ సింగ్. మై రేటింగ్ 10/10.

    ఛాలెంజ్ చేస్తున్నా.. ఇంకెవ్వరూ చేయలేరు

    కబీర్ సింగ్ సినిమా చూశాక ఒక్కటే చెప్పాలనుకుంటున్నా. షాహిద్ కపూర్ శకం మొదలైంది. ఆయనను మించి పర్‌ఫార్ చేసే స్టార్ ఉండనే ఉండడు. ఛాలెంజ్ చేస్తున్నా.. ఇంకెవ్వరూ ఇలాంటి పాత్ర చేయలేరు.

    బ్రిలియంట్ కియారా అద్వానీ

    కబీర్ సింగ్ సినిమా ఇప్పుడే చూశాను. స్క్రిప్ట్ మొదలుకొని హీరోహీరోయిన్స్ నటన, డైరెక్టర్ నేరేషన్ సూపర్ గా ఉంది. బ్రిలియంట్ కియారా అద్వానీ. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలో స్పెషల్ ట్రీట్ ఇచ్చింది. టోటల్‌గా సూపర్ మూవీ.

    పిచ్చెక్కించే పర్‌ఫార్‌మెన్స్.. కియారా ఏం చెప్పమంటారు

    కబీర్ సినిమా చూశాను. మైండ్ బ్లోయింగ్ మూవీ. కియారా, షాహిద్ చించేశారు. పిచ్చెక్కించే పర్‌ఫార్‌మెన్స్ చూపించారు. కియారా అద్వానీ గురించి చెప్పాలంటే మాటలు చాలవు. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ చాలా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది.

    English summary
    Shahid kapoor and Kiara Advani plays tremendous role in Kabir Singh movie. He performed very well in liplock seens, romantic movements. This movie twitter review says
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X