విజయ్ దేవరకొండపై స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్

Recommended Video

Bollywood Star Shahid Kapoor Comments On Vijay Devarakonda || Filmibeat Telugu

ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదుగుతున్న నటుడికి తోటి నటులు, సీనియర్ హీరోల ప్రశంసలు బంగారు తివాచీ లాంటివి. ఎంతో ప్రతిభ కనబరిస్తే తప్ప జూనియర్ హీరోలను సీనియర్ హీరోలు పొగిడిన సందర్భాలు ఉండవు. ఒకవేళ ప్రశంసలు గుప్పించారంటే ఖచ్చితంగా సదరు హీరోలో ఏదో టాలెంట్ దాగి ఉందనే అర్థం. ఫ్యూచర్‌లో అతనో పెద్ద స్టార్‌గా వెలుగొందుతాడనే కాన్ఫిడెన్స్ ఉంటేనే సాదారణంగా సీనియర్లు ప్రశంసిస్తుంటారు. ఇదే కోవలో తాజాగా యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటనపై సీనియర్ హీరో షాహిద్ కపూర్ అభినందనలు గుప్పించడం హాట్ టాపిక్ అవుతోంది.

తెలుగులో విజయ్ దేవరకొండ.. హిందీ షాహిద్ కపూర్

తెలుగులో విజయ్ దేవరకొండ.. హిందీ షాహిద్ కపూర్

అప్పట్లో తెలుగు తెరను ఓ ఊపు ఊపేసింది అర్జున్ రెడ్డి చిత్రం. చిన్న చిత్రంగా వచ్చి భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమాను హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో విజయ్ దేవరకొండ పోషించిన పాత్రనే హిందీలో షాహిద్ కపూర్ చేస్తున్నారు.

విజయ్‌పై షాహిద్ కపూర్ కామెంట్స్

విజయ్‌పై షాహిద్ కపూర్ కామెంట్స్

తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ చూపిన అభినయాన్ని మెచ్చుకుంటూ షాహిద్ కపూర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రీమేక్ సినిమాలు చేయడమే పెద్ద కష్టమైన పని అని, అది ఒరిజినల్ వర్షన్‌లో విజయ్ చూపిన అభినయం తనకు చాలా కష్టతరమైందని ఆయన పేర్కొన్నారు. అర్జున్ రెడ్డిలో విజయ్ పర్‌ఫార్‌మెన్స్ ఆధ్బుతం అని కితాబిచ్చారు షాహిద్ కపూర్.

విజయ్ దేవరకొండ లెవెల్..

విజయ్ దేవరకొండ లెవెల్..

విజయ్‌పై షాహిద్ కపూర్ చేసిన కామెంట్స్ చూసి ఖుషీ అవుతూ ఇదీ విజయ్ దేవరకొండ లెవెల్ అని చెప్పుకుంటున్నారు ఆయన అభిమానులు. ఓ బాలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటనను ప్రశంసించడం ఆయన అభిమానుల్లో ఆనందోత్సాహాలను నింపుతోంది. ఇప్పటికే చిరంజీవి లాంటి టాప్ స్టార్స్ చేత ప్రశంసలందుకున్న విజయ్ తాజాగా బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ మెప్పు కూడా పొందడం చూస్తుంటే అతని ఫ్యూచర్ ఎలా ఎంటుందో అర్థమవుతోంది.

కబీర్ సింగ్

కబీర్ సింగ్

అర్జున్ రెడ్డి రీమేక్‌గా వస్తున్న కబీర్ సింగ్ సినిమాలో షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్నారు. తెలుగు వర్షన్‌కి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగానే ఈ సినిమాను కూడా డైరెక్ట్ చేస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌లో హీరో హీరోయిన్ లిప్‌లాక్ సన్నివేశాలు యువతకు బాగా కనెక్ట్ అయ్యాయి. చిత్రాన్ని జూన్ 21 వ తేదీన విడుదల చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X