అనుకున్నదే జరిగింది.. శైలజారెడ్డి అల్లుడు విడుదల వాయిదా, చైతు ట్వీట్!
అక్కినేని యువ హీరో నాగ చైతన్య నటించిన తాజా చిత్రం శైలజారెడ్డి అల్లుడు. ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. ప్రముఖ దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. నాగ చైతన్య, అను ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రం జంటగా నటిస్తున్నారు.
సీనియర్ నటి రమ్య కృష్ణ కీలకమైన అత్త పాత్రలో టైటిల్ రోల్ పోషిస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ఆగష్టు 31 న విడుదుల కావాలి. కానీ శైలజా రెడ్డి అల్లుడు చిత్రం విడుదల వాయిదా పడింది అంటూ నిన్నటినుంచి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఆ వార్తలు నిజమయ్యాయి. శైలజారెడ్డి అల్లుడు చిత్రం వాయిదా పడిందని ధృవీకరిస్తూ చైతు తాజాగా ట్వీట్ చేశాడు. విడుదల వాయిదాకు గల కారణాలు వివరించాడు. కేరళలో వరద విపత్తు కారణంగా రీ రికార్డింగ్ పనులు ఇంకా పూర్తి కాలేదు. అందువలనే విడుదల వాయిదా వేయక తప్పడం లేదని చైతు తెలిపాడు. త్వరలో కొత్త విడుదల తేదీ ప్రకటిస్తామని తెలిపాడు. అదే సమయంలో కేరళ ప్రజలకు అందరూ సాయం అందించేలా ముందుకు రావాలని, వరదలు ముగిసి జనజీవనం సజావుగా సాగేలా అంత ప్రార్థించాలని చైతు కోరాడు.


Click it and Unblock the Notifications











