‘శైలజారెడ్డి’ కోసం నాగార్జున, నాని.. 9న ప్రీ రిలీజ్!

By Rajababu

నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్, రమ్యకృష్ణ నటించిన శైలజారెడ్డి అల్లుడు విడుదలకు సిద్దమవుతున్నది. ఇప్పటికే ఈ చిత్ర టీజర్లు, ట్రైలర్లు, ఆడియోకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. దాంతో శైలజారెడ్డి అల్లుడు చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'శైలజారెడ్డి అల్లుడి'ని అందంగా ముస్తాబు చేసి సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఇక శైలజారెడ్డి అల్లుడు చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను భారీగా నిర్వహించేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి. ఈవెంట్‌ను సెప్టెంబర్ 9న హైదరాబాద్ కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

శైలజారెడ్డి ప్రీ రీలిజ్ ఈవెంట్‌కు కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ ప్రకటన సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది.

దాసరి అరుణ్ కుమార్, గిరిబాబు, నరేష్, మురళీశర్మ, వెన్నెల కిషోర్, రఘుబాబు, పృథ్వి, మధునందన్, శత్రు, కల్యాణి నటరాజన్ తదితరులు నటిస్తున్నారు.

Shailaja Reddy Alludu Pre Release event on 9th September from 6pm onwards

సితార ఎంటర్టైన్‌మెంట్ రూపొందించిన ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తుండగా, నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X