'నాలుగో సింహం'గా షకలక శంకర్.. అవినీతిపై కన్నెర్ర
తెలుగు తెర మీద తనదైన కామెడీతో ఆకట్టుకొన్న షకలక శంకర్.. ఇటీవల కాలంలో హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఆనందో బ్రహ్మ, రాజు గారి గది2 లాంటి చిత్రాలు హాస్యనటుడిగా మంచి పేరు తెచ్చిపెడితే.. శంభో శంకర చిత్రంతో హీరోగా మారిన ఆయన మంచి మార్కులే కొట్టేశారు. ప్రస్తుతం డ్రైవర్ రాముడు చిత్రంలోనే నటిస్తూ.. మరో సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అదే నాలుగు సింహం. ఈ సినిమా గురించి వివారాల్లోకి వెళితే..
ఆర్.ఏ.ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో జానీ నిర్మిస్తున్న చిత్రం 'నాలుగో సింహం'. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా షకలక శంకర్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. దాదాపు ఈ చిత్ర షూటింగ్ పూర్తి కావచ్చింది. షకలక శంకర్ సరసన ముంబై ముద్దుగుమ్మ అక్షయ్ శెట్టి నటిస్తోంది.

మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అమానుషాలు.. వాటిని చూసీ చూడనట్లుగా ఉండే అవినీతి అధికారుల నిర్వాహకాలపై నిప్పులు చెరుగుతూ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్నది.

ఈ చిత్రంలో 'ముద్దమందారం' పూర్ణిమ, ఆర్.కె, సత్య ప్రకాష్, గుర్లిన్ చోప్రా, గబ్బర్ సింగ్ బ్యాచ్ ఇతరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శ్రవణ్ కుమార్, సంగీతం: అజయ్ పట్నాయక్, ఫైట్స్: దేవరాజ్, ఎడిటింగ్: శ్రీ, కథ-స్క్రీన్ ప్లే-నిర్మాణం-దర్శకత్వం: జానీ!!


Click it and Unblock the Notifications











